టీడీపీ ఎంపీ కేశినేని నాని చర్యలు పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లు ట్విట్లతో రభస సృష్టిస్తున్న నాని ఇంకో అడుగు ముందుకేసి మరో చర్చకి తెర లేపారు. ఈసారి తన ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాన్ని ఖాళీ చేసి దాని తర్వాత ఒక ట్విట్ చేసి కలకలం రేపారు. టీడీపీ విజయవాడ అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి ఖాళీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుమతితో అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి తాత్కాలికంగా ఆటోనగర్ గురునానక్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయానికి మార్చినట్టు తెలిపారు. అర్బన్ టీడీపీ సొంత కార్యాలయం ఏర్పాటయ్యే వరకు అర్బన్ నేతల సమావేశాలు, పార్టీ కార్యక్ర మాలను జిల్లా పార్టీ కార్యాలయం నుంచే నిర్వహించనున్నట్టు వివరించారు. నగర పరిధి లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు, ఆయా డివిజన్ల అధ్య క్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్త లు, శ్రేణులు ఈ మార్పును గమనించి అర్బన్ పార్టీ కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు సహకరించాలని కోరారు.ఇదంతా ఒక ఎత్తు అయితే కార్యాలయాన్ని ఖాళీ చేసిన కేశినేని ఒక ట్విట్ చేశారు. ‘‘లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్’’ అంటూ కేశినేని తాజా ట్వీట్ చేశారు. దాంతో ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఆయన టీడీపీని వదిలి బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. కానీ తాను పార్టీ మారబోనని, టీడీపీలోనే కొనసాగుతూ తన అభిప్రాయాలను నిర్మొ హమాటంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అందుకనుగుణంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు లోక్‌సభలో టీడీపీ విప్ పదవిని ఇవ్వగా.. ఎంపీ తిరస్కరించారు. అంత పెద్ద బాధ్యతను తాను నిర్వహించలేనని, వేరొకరికి ఆ పదవిని అప్పగించాలని ఫేస్‌బుక్ ద్వారానే అధినేత చంద్రబాబుకు సమాధానమివ్వడం అప్పట్లో చర్చనీ యాంశమైంది.ఇటీవల కశ్మీర్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ సమర్థించగా.. ఎంపీ నాని స్పందిస్తూ కశ్మీరుపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కశ్మీరుకు, దేశాని కి మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో కాలమే సమాధానం చెప్పా లని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, బందరు పోర్టు పనులను రద్దు చేస్తూ జీవో జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంటే.. ఎంపీ మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందిస్తూ ‘‘సీఎం జగన్ గారూ.. మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను.
కేశినేని భవన్ నుండి తెదేపా కార్యాలయం ఖాళీ
Related tags :