DailyDose

విదేశాలకు వెళ్ళకుండా మహిళల నిలిపివేత-నేరవార్తలు–08/13

Shamshabad Immigration Officials Stop Women Going To Gulf-Telugu Crime News Today-Aug 13 2019-విదేశాలకు వెళ్ళకుండా మహిళల నిలిపివేత-నేరవార్తలు–08/13

* నకిలీ ధ్రువపత్రాల సాయంతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు మహిళలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్న సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు మహిళలు ఎయిర్‌ ఇండియా ఏఐ-950లో దుబాయికి, పన్నెండు మంది ఏఐ-977లో మస్కట్‌కు వెళ్లడానికి టికెట్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో 16 మంది విదేశాలకు వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చారు. మహిళల ప్రవర్తన, నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు పాస్‌పోర్టు, వీసా, ఇతరత్రా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేకపోవడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పని కల్పించే పేరుతో కొంతమంది ఏజెంట్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* అత్తింటి వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో ఈ ఘటన జరిగింది. అత్తింటి వేధింపుల కారణంగా వడ్లూరి సంధ్య అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
* కడప జిల్లా రాజంపేట మండలం ఎస్ఆర్ పాళెం ఫారెస్ట్ బీట్లో అదికారుల కూంబింగ్.జల్లికట్టు కోన వద్ద భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లు.తమిళనాడుకు చెందిన 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు , 108 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఢిల్లిలోని టెర్మినల్‌ 2 ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులకు బెదిరింపు ఫోన్‌ వచ్చింది. దీనితో అధికారులు అప్రమత్తమై విమానాశ్రయమంతా తనిఖీలు నిర్వహించారు. అనంతరం బాంబు బెదిరింపు ఉత్తిదేనని వెల్లడైంది. ఢిల్లిలోని విమానాశ్రయాల్లో ఇప్పటికే భారీ భద్రత ఉన్నప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరుగవచ్చుననే హెచ్చరికలతో మరింత భద్రతను పెంచారు. టి2 విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఫోన్‌చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఫోన్‌ చేయలేదని అతడు చెప్పాడు.పట్టుబడ్డ దుంగల విలువ 13.5 లక్షలు అని అధికారులు తెలిపారు.
* కావలి- వెంకటేశ్వరపురం మధ్య దిగువ లైనులో వస్తున్న యశ్వంత్పూర్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎదురుగా పట్టాలపై వచ్చిన గేదెలను ఢీకొట్టింది.
*నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి అంతిమ సంస్కారం జరపాల్సిన కుమారుడు తన కర్కశ మనస్తత్వాన్ని చాటాడు. అంత్యక్రియలకు డబ్బులు లేవంటూ కన్నతల్లి శవాన్ని చెత్తకుండీలో పారేసి చేతులు దులుపుకొన్నాడు. ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది.
* భద్రత కల్పించాల్సిన వాడే బరి తెగించాడు. నలుగురు అనాథ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి పాల్పడిన ఓ ప్రైవేటు అనాథ బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
* నెల్లూరు గ్రామీణ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి అనుచరులతో కలిసి శ్రీధర్రెడ్డి తన ఇంట్లో చొరబడి, దాడి చేశారని ‘జమీన్ రైతు’ పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*సాగర్ జలాశయం గేట్లు తెరవడంతో స్నేహితులతో కలిసి చూడడానికి వెళ్లిన ఒక వ్యక్తి అనూహ్యంగా నదిలో గల్లంతయ్యాడు.
*పాతకక్షల నేపథ్యంలో హైదరాబాద్లోని సనత్నగర్ ఠాణా పరిధిలో ఓ రౌడీషీటర్ను దారుణ హత్యకు గురయ్యాడు.
*నకిలీ ధ్రువపత్రాల సాయంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
*వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న కిరాణా దుకాణంపైకి దూసుకువెళ్లి నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి కూడలి వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
*సామాజిక మాధ్యమాల్లో క్రేజ్ పెంచుకోవడానికి యువత చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆ క్రేజ్ కోసం తాము చేస్తున్నది మంచో, చెడో కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దిల్లీలో ఓ వ్యక్తి సామాజిక మధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి వినూత్నంగా ఏదైనా చేద్దామని ప్రయత్నించి చివరకు అరెస్టు అయ్యాడు.
*ఓ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలోని హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి మరో కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను నాగోలుకు చెందిన భాజపా నాయకుడు కోసూరి కిశోర్ చారి, అతని భార్య, కుమారుడిగా గుర్తించారు.
* పాతకక్షల నేపథ్యంలో హైదరాబాద్లోని సనత్నగర్ ఠాణా పరిధిలో ఓ రౌడీషీటర్ను దారుణ హత్యకు గురయ్యాడు.
*భద్రత కల్పించాల్సిన వాడే బరి తెగించాడు. నలుగురు అనాథ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి పాల్పడిన ఓ ప్రైవేటు అనాథ బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.