ScienceAndTech

చేతిలో తాళం కుట్టేసుకుంది

This tesla owner hacked her car keys under her skin

కారును స్టార్ట్‌ చేసేందుకు అవసరమైన ప్రత్యేక చిప్‌ను శరీరంలోకి చొప్పించుకోవడం ద్వారా అమెరికాలో ఓ మహిళ అందర్నీ నివ్వెరపరిచారు. ‘బయో హ్యాకింగ్‌’గా పిలుస్తున్న ఈ సాంకేతికత త్వరలో మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమీ డీడీ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆమెకు టెస్లా కంపెనీకి చెందిన మోడల్‌-3 కారు ఉంది. దాన్ని స్టార్ట్‌ చేసేలా తన చేతినే తాళంచెవిగా మార్చుకోవాలని అమీ భావించారు. కారు వాలెట్‌ కార్డు నుంచి ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డు (ఆర్‌ఎఫ్‌ఐడీ)’ చిప్‌ను జాగ్రత్తగా వేరుచేశారు. నిపుణుల సాయంతో చిప్‌ను కుడి చేతిలోకి ఎక్కించుకున్నారు. ఫలితంగా ఆమె చెయ్యే కారుకు తాళంచెవిగా మారింది. అయితే, ఈ విధానంలో కారును తాను స్టార్ట్‌ చేయగలిగిందీ లేనిదీ అమీ తెలియజేయలేదు. అమీ బయో హ్యాకింగ్‌కు పూనుకోవడం ఇదే తొలిసారి కాదు. తాను రాగానే ఇంటి తలుపులు తెరుచుకునేలా గతంలో ఎడమ చేతిలోకి ప్రత్యేక చిప్‌ చొప్పించుకున్నారు.