ఈ నేపథ్యంలో ఆమె పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తన తల్లిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మా.. ఐ లవ్యూ’ అని పోస్ట్ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు కూడా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ‘మిమ్మల్ని మిస్సవుతున్నాం మేడమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ హోటల్ రూమ్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా, నటి ప్రియాంక చోప్రా తదితరులు కూడా ఆమెతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెట్టారు.
నేడు అతిలోకసుందరి జయంతి
Related tags :