మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది. ఈ నియామక పదవీకాలం రెండేళ్లుగా ఉంటుంది. పరిపాలనలో తెలుగు భాషకు ఇతోధికంగా పెద్దపీట వేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భాషాభివృద్ధి, పరిరక్షణ వంటి కార్యక్రమాలను యార్లగడ్డ పర్యవేక్షిస్తారు. తెలుగు హిందీ భాషల్లో PhD పట్టభద్రులైన యార్లగడ్డ ఇప్పటి వరకు రెండు సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలతో పాటు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన నియామకం పట్ల ప్రవాసులు హర్షం వెలిబుచ్చారు.
ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా యార్లగడ్డ నియామకానికి జీవో జారీ
Related tags :