ఈ కాలంలో ఇది సర్వసాధారణమైన సమస్య. దీన్ని అదుపులో ఉంచాలంటే… రెండు చెంచాల ధనియాలు వేయించాలి. దీనికి కప్పు నీరు చేర్చి పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లు మరిగి, కషాయంలా తయారయ్యాక దింపేయాలి. వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ప్రతి నాలుగు గంటలకోసారి కొద్దికొద్దిగా తాగితే ఉపశమనం ఉంటుంది. నేలవేము మొక్కను శుభ్రంగా కడిగి రసం తీసుకుని కొద్దికొద్దిగా తీసుకున్నా వైరల్ జ్వరాలు తగ్గుతాయి. తిప్పతీగని నీటిలో మరిగించి కషాయం చేసుకుని చెంచా చొప్పున తీసుకోవాలి. కప్పు నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసి కాచి వేడిగా ఉండగానే తేనె కలిపి తాగినా జ్వరం అదుపులో ఉంటుంది.
ధనియాలు దంచి కొడితే…జ్వరం పరార్
Related tags :