‘‘పేరు గుర్తింపు ఇదేదీ ఊహించలేదు. అన్నీ అనుకోకుండా వచ్చినవే. కానీ ఇది చాలు అని ఎప్పుడూ అనిపించలేదు’’ అంటోంది రష్మిక. ఇటీవల ‘డియర్ కామ్రేడ్’తో లిల్లీగా మురిపించిన ఈ తార ప్రస్తుతం, మహేష్, నితిన్లతో కలిసి నటిస్తోంది. ‘‘నా జీవితంలో ఆశ్చర్యకరమైన విషయాలు చాలానే జరిగాయి. అందులో ఒకటి నేను నటిని కావడం. తొలి అడుగుల్లోనే విజయాలొచ్చాయి, గుర్తింపు వచ్చింది. కానీ నేనింకా చేయాల్సింది చాలా ఉంది. వచ్చిన ఆ పేరుని వాడుకొని బతికేద్దాం అనుకొనే రకాన్ని కాదు. ఇంకా శ్రమిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో కదా అని ఆలోచిస్తుంటా. విజయం వచ్చినా, పరాజయం వచ్చినా తర్వాతేంటి? అనే ప్రశ్నే నన్ను ముందుకు నడిపిస్తుంటుంద’’ని చెప్పింది రష్మిక. ఆమె తదుపరి అల్లు అర్జున్తోనూ కలిసి నటించనుంది.
పేరు మీద బతికే బాపతు కాదు
Related tags :