Health

సదా కూర్చోవద్దు….

సదా కూర్చోవద్దు....Do not sit for longer periods at work. Here are some tips.

ఎత్తుకి తగ్గట్లుగా స్టాండింగ్‌ డెస్కుల్ని అమర్చుకుని గంటకి పది నిమిషాల చొప్పున నిలబడాలి. అలాంటి ఏర్పాటు లేకపోతే గంటకి ఐదు నిమిషాల బ్రేక్‌ తీసుకుని నడవడం బెటర్‌. ఫోన్‌ మాట్లాడాల్సి వచ్చినా నడుస్తూ మాట్లాడితే మేలు.

* అడుగుల్ని లెక్కించే పెడోమీటర్‌ వల్ల మంచి ఫలితం ఉంటుందట. గంటకి 500 అడుగుల చొప్పున రోజుకి పదివేల అడుగులు వేయడం అలవాటు చేసుకోవాలి. ఆప్‌ ద్వారా ఈ అడుగుల్ని లెక్కించుకోవచ్చు.
* కొన్నిరకాల యాక్టివిటీ మానిటర్లూ గెట్‌మూవింగ్‌, మూవ్‌మోర్‌ వంటి ఆప్‌లూ కూడా కూర్చున్న సమయాన్ని అలారం సౌండ్‌ ద్వారా అలర్ట్‌ చేస్తాయి.
* డెస్కుటాప్‌ కంప్యూటర్లమీద పనిచేసేవాళ్లు ఆర్‌ఎస్‌ఐ గార్డ్‌ అనే ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అది గంటగంటకీ స్క్రీన్‌మీద లేవాల్సిన సమయం వచ్చిందని అలర్ట్‌ చేస్తుంటుంది.
* ట్రెడ్‌మిల్‌ డెస్కులు బెటరే గానీ అంతటా సాధ్యం కాదు. వీడియోగేమ్స్‌ ఆడేవాళ్లు వాటికి బదులు కాసేపు ఇతరత్రా ఆటలు ఆడుకోవడం బెటర్‌. లంచ్‌, టీ బ్రేక్స్‌లో ఎంత వేగంగా నడిస్తే అంత మేలు.
* ఆఫీసులోనే కాదు, ఇంట్లోనూ మొక్కలకి నీళ్లు పట్టడం, గిన్నెలు కడగడం, నిలబడి టీవీ చూడటం వంటి చిన్నపాటి పనులు చేసుకుంటూ ఎంత నిలబడ గలిగితే అంత నిలబడటం మేలు.మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా క్రమంగా అలవాటవుతుంది.

వెన్నెముక, తల, మెడ నిటారుగా ఉంచి కూర్చోవాలి. డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ మీ కంటికి 15 డిగ్రీల కోణంలో ఉండాలి. దానికన్నా తల మరీ పైకీ కిందకీ ఉండకూడదు. కీబోర్డు లేదా మౌస్‌ ఉపయోగిస్తున్నప్పుడు మణికట్టు కుర్చీ హోల్డర్‌మీద ఆనుకునేలా ఉండాలి. కూర్చున్నప్పుడు పాదాలను నేలకు ఆనించి నిటారుగా కూర్చోవాలి. అదే పొజిషన్‌లో కూర్చుని మధ్యమధ్యలో మెడను నెమ్మదిగా తిప్పుతూ భుజాలకు ఆనించేలా ఐదు నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మెడ, భుజాల కండరాలు పట్టేయకుండా ఉంటాయి. స్పాండిలోసిస్‌ రాకుండా ఉంటుంది. అలాగే ఓ కాలును కింద ఉంచి మరో కాలుని పైకి ఎత్తి కిందకి దించాలి. ఇదేపద్ధతిలో రెండో కాలునీ చేయాలి. ఇలా కాళ్లను కదపడం వల్ల రక్తప్రసరణ మెరుగై పట్టేయకుండా ఉంటాయి.