గోపీచంద్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘చాణక్య’. మెహరీన్ కథానాయిక. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. టాకీభాగం చిత్రీకరణ పూర్తయినట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘స్పై థ్రిల్లర్ సినిమా ఇది. గూఢచారి చాణక్యగా గోపీచంద్ అభినయం, ఆయన కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. విదేశాల్లో చిత్రీకరించే పాటలతో సినిమా పూర్తవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, రచన: అబ్బూరి రవి.
చాణక్య మెహరీన్
Related tags :