Sports

పీటీ ఉషకు అరుదైన గౌరవం

PT Usha Becomes AAA Member

భారత దిగ్గజ అథ్లెట్‌ PT ఉషకు అరుదైన గౌరవం దక్కింది. 80వ దశకంలో ఆసియా ప్రఖ్యాత స్ర్పింటర్‌గా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన 55 ఏళ్ల ఉషకు ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (AAA)లోని అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా చోటు దక్కింది. హ్యామర్‌ త్రోలో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ యూజ్బెకిస్థాన్ కు చెందిన ఆండ్రీ అబ్దువలియెవ్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల AAA అథ్లెట్ల కమిషన్‌లో ఉష ఓ సభ్యురాలిగా వ్యవహరిస్తారు.