Movies

అత్తివరద సన్నిధిలో నయనతార

అత్తివరద సన్నిధిలో నయనతార

తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజ స్వామిని అగ్ర కథానాయిక నయనతార దర్శించుకున్నారు. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అత్తివరదరాజ స్వామి 40ఏళ్లకు ఓసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. 1979లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి మళ్లీ ఈ ఏడాది జూన్‌ 1 నుంచి దర్శనమిస్తున్నారు. ఆగస్టు 17 వరకు దర్శించుకోవచ్చు. తిరిగి ఆగస్టు 18న స్వామి వారిని పుష్కరిణిలో దాచిపెడతారు. స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ దంపతులు కూడా అత్తివరదరాజ స్వామిని దర్శించుకున్నారు.