ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా చేస్తున్న అమెరికా పర్యటనలో భాగంగ శనివారం సాయంత్రం డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్‌సన్ సెంటరులో ఉత్తర అమెరికా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించి వారితో ముఖాముఖి కలవనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఇప్పటికే పలువురు వైకాపా ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు అమెరికావ్యాప్తంగా ప్రవాసాంధ్రులు శుక్రవారం సాయంత్రం డల్లాస్‌కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రముఖ ప్రవాసాంధ్రుల్లో కొంతమంది జగన్‌తో డీసీ పర్యటనలో ఉన్నారు. వీరు జగన్‌తో కలిసి శనివారానికి డల్లాస్ చేరుకోనున్నారు. శుక్రవారం డల్లాస్ కన్వెన్షన్ సెంటరు వద్ద ప్రవాసాంధ్రుల సందడి నెలకొంది. ఇప్పటివరకు డల్లాస్ చేరుకున్న వారిలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య లక్ష్మీప్రసాద్, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కాసు మహేష్‌రెడ్డి, కొఠారు అబ్బయ్యచౌదరి, కరుమూరి వెంకటనాగేశ్వరరావు, గుడివాడ అమరనాథ్, ఏపీ ఎన్ఆర్‌టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్, సిలికానాంధ్ర నుండి కూచిభొట్ల ఆనంద్, దీనబాబు కొండుభట్ల, చమర్తి రాజు, వేట శరత్, పలు ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
https://www.facebook.com/tnilive/videos/2088462461463132/?t=0