ఏపీ ఎన్నార్తీ ఐకాన్ టవర్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని కోరుతూ ఫ్లాట్ల కొనుగోలుదారులు లేఖ రాశారు. నిర్మాణం చేపట్టకపోతే తాము చెల్లించిన మొత్తాలను వెనక్కు ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో ప్రవాసాంధ్రులకు ఫ్లాట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రిటైల్ అమ్మకాలకు అనువుగా 5.69 ఎకరాల్లో నిర్మించే ఐకాన్ భవనంలో ఫ్లాట్ల కొనుగోలుకు 104 మంది ప్రవాసాంధ్రులు మొదటి విడతగా రూ.33 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం చెల్లించిన వెంటనే ఎన్ని రోజుల్లో భవనాన్ని పూర్తి చేస్తామో ఒప్పంద పత్రాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ ఎన్నికలు సమీపించడంతో గత ప్రభుత్వం ఒప్పంద పత్రాన్ని ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం కొలువై రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో భవన నిర్మాణంపై స్పష్టత కోరుతూ ప్రవాసాంధ్రులు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సీఎం జగన్మోహన్రెడ్డి చెంతకు చేరింది.
APNRT భవనం కడతారా కట్టరా?
Related tags :