టెక్ దిగ్గజం గూగుల్ తన ప్లే స్టోర్ లోని 85 యాప్ లను తొలగించింది. భద్రతా కారణాల రీత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. యాడ్ వేర్ అనే మాల్ వేర్ రకం వైరస్ ఈ యాప్ లలో ఉందంటూ ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యురిటీ కంపెనీ హెచ్చరించడంతో గూగుల్ వాటిని తొలగించింది. ఇవి అనుకూల యాడ్ లను చూపించడమే కాక వినియోగదారుల సమాచారాన్ని తస్కరిస్తున్నాయని గూగుల్ తెలిపింది. తొలగించిన యాప్ లలో ఎక్కువగా ఫోటోగ్రఫి గేమింగ్ కు సంబందించిన ఎక్కువగా ఉన్నాయని వీటిని ఇప్పటికే ఎనిమిది మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని గూగుల్ పేర్కొనదు. వీటిలో సూపర్ సెల్ఫి, కాస్ కెమెరా, వాన్ స్ట్రోక్ పజిల్ లాంటి ప్రముఖ యాప్ లు కూడా ఉన్నాయి ఈ యాప లను ప్లే స్టోర్ లో వివిధ ప్రాంతాల నుంచి అప్ లోడ్ చేసినా అవి అన్నీ ఒక రీతిలో ప్రవర్తిస్తుండడం పై అనుమానం వ్యక్తం చేసింది. వాటి పనితీరు ఒకే విధంగా ఉంటూ ఆందోళన కలిగించిందని తెలిపింది. అయితే ఈ యాడ్ వేర్ పాత ఆండ్రాయిడ్ ఫోన్ లను ఎం చేయదని గూగుల్ పేర్కొంది.
85 యాప్‌ల తొలగింపు
Related tags :