* కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో విజయవాడ కృష్ణా కరకట్ట వెంటఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసంలో ప్రస్తుతం ఎవ్వరూ లేకపోవడంతో స్థానిక వీఆర్వో ప్రసాద్ నోటీసును గోడకు అంటించారు. వరదల వల్ల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా ముందుజాగ్రత్తగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తాడేపల్లి తహసీల్దార్ పేర్కొన్నారు. వరదల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నోటీసుల్లో కోరారు.
* కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. స్వా మివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న నిర్మలా సీతారామన్‌కు టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద స్వాగతం పలికగా, విజయసాయి రెడ్డి కూడా స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కేంద్రమంత్రి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
* కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్‌పై ఉంచినట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు శనివారం తెలిపారు. ఆయనకు ఈసీఎంఓ(ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చినట్లు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వీటిని అమర్చారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
* ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో తిరుమల ప్రత్యెక అధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక నిర్వహించారు. ఈ కార్యక్రమమలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ లో కిలో రూ. 45 గల బియ్యాని రైస్ మిల్లర్లు తితిడీకి రూ.38 కు అందిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రోజు సమీక్ష అనంతరం కిలో బియ్యం ధరను మరో రూపాయి తగ్గించినట్లు వెల్లడించారు.
* ఆసియా, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ విజేత రెజ్లర్ బజ్రంగ్ పునియా రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకు నామినేట్ అయ్యాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అతడి పేరును ఖరారు చేసింది. ‘‘ఖేల్రత్న పురస్కారానికి బజ్రంగ్ పేరును ఎంపిక కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది’’ అని ఈ పరిణామాల గురించి తెలిసిన ఓ వ్యక్తి చెప్పాడు. మరో అథ్లెట్ను కూడా ఖేల్రత్నకు ఎంపిక చేసే అవకాశముందని తెలిపాడు. బైచుంగ్ భుటియా, మేరీకోమ్ కూడా సభ్యులుగా గల ఈ కమిటీనే అర్జున, ద్రోణాచార్య అవార్డీలను కూడా ఎంపిక చేయనుంది. బజ్రంగ్ (65 కేజీ) నిరుడు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు.
*ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భూటాన్ వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి ఆ దేశ ప్రధాని లోటే షేరింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ సైనిక స్వాగతం అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఉదయం మోదీ భూటాన్ వెళ్లారు. పలు ద్వైపాక్షిక అంశాలపై రెండు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి.
*గంజాయి అమ్ముతున్న నలుగురు బీటెక్ విద్యార్థులను హైదర్‌గూడ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తుమ్మ భానుతేజారెడ్డి, దుబ్బాకుల సాయిసురేశ్ చంద్ర యాదవ్, కర్నాటి అఖిల్, షేక్ నయిమ్, డీకొండ సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నిందితులు 2018 నవంబర్‌లో, 2019 ఫిబ్రవరిలో కూడా పట్టుబడి జైలుకు వెళ్లోచ్చారు.
*తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకున్నా.. కృష్ణమ్మ, భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో కాస్త లోటు ఉందని అధికారులు తెలిపారు.
*ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అధికారులు నోటీసులు పంపించారు.. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సింగా నోటీసులో పేర్కొన్నారు.. తాడేపల్లి డిప్యూటీ తహసీల్దార్ నోటీసు జారీ చేయగా.. ఉండవల్లి వీఆర్వో ఆ నోటీసుతో చంద్రబాబు ఇంటికి వెళ్లారు.
* పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతమైన పాశమైలారంలోని నిర్మల కెమికల్ (సాల్వెంట్స్ ) కంపెనీలో ఈ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని కెమికల్ డంప్ లో మంటలు చెలరేగటంతో నిర్మల కెమికల్ సాల్వెంట్ కంపెనీతో పాటు దగ్గర్లోని మరో రెండు పేపర్ కంపెనీలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. చుట్టు పక్కల ప్రాంతాలలో కూడా మంటలు వ్యాపించడంతో పోలీసులు, పైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
* జమ్ముకశ్మీర్ సరిహద్దులో భారత ఆర్మీ, చొరబాటుదారుల మధ్య ఫైరింగ్ కొనసాగుతోంది. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సైన్యం మరోసారి పక్కనపెట్టింది. ఇండియన్ ఆర్మీపై కాల్పులకు దిగింది. పాక్ సైనికుల కాల్పులను.. ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది.
* కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ)ను డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 18వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు www.ctet.nic.inలో ఆగస్టు 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
*ఉత్తమ అవార్డుల ఎంపికలో చిత్తశుద్ధినే శంకించే మరో ఉదంతమిది.. ఆమధ్య.. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన లావణ్య అనే తహసీల్దారు ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న కొన్నాళ్లకే రూ.93 లక్షల నగదుతో ఏసీబీకి పట్టుబడడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
*ఉండవల్లిలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటి పరిసరాల్ని ఇద్దరు యువకులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తూ పట్టుబడటం దుమారం రేపింది. పట్టుబడ్డ యువకులు.. కిరణ్ అనే వ్యక్తి తమకు ఆ బాధ్యత అప్పగించారని, ముఖ్యమంత్రి పాల్గొన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని చిత్రీకరించిందీ తామేనని చెప్పారు.
*పోలవరం ప్రాజెక్టు టెండర్ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న (రీ టెండరింగ్) నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని, ప్రాజెక్టుని అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆందోళన వ్యక్తంచేసింది.
*ఎయిమ్స్’లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి శుక్రవారం కూడా విషమంగానే ఉంది. వైద్య నిపుణుల బృందం జైట్లీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.
* ‘ఎయిమ్స్’లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి శుక్రవారం కూడా విషమంగానే ఉంది. వైద్య నిపుణుల బృందం జైట్లీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.
* రెండు రోజులుగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి సగటున రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు వెళ్లింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో శ్రీశైలం నుంచి 32.80 టీఎంసీలు.. మొత్తంగా ఒక్కరోజులో 60 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు.
*జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి అసాధారణ రీతిలో రహస్య సంప్రదింపులు జరిపింది. పాకిస్థాన్ సర్వకాల మిత్రదేశమైన చైనా ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ భేటీ జరిగింది.
*నెహ్రూ జూ పార్కులో మరో తెల్ల పులి శుక్రవారం చనిపోయింది. ఇంతకుముందే ఓ మగ పులి ‘వినయ్’(22) అనారోగ్యంతో మృత్యువాత పడటం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ‘బద్రీ’ కూడా తుదిశ్వాస విడవడంతో, ఇక్కడి తెల్లపులుల సంఖ్య తొమ్మిదికి పడిపోయింది.
*భారత పౌరసత్వం వ్యవహారంలో అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించాలంటూ కేంద్రాన్ని ఆదేశిస్తూ గత నెల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శుక్రవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
*సివిల్స్లో ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారులు ఐఏఎస్ కేటాయించారు. మరో తొమ్మిది మందికి ఐపీఎస్, ఇద్దరికి ఐఎఫ్ఎస్ దక్కింది. మొత్తం మీద ఏపీ, తెలంగాణ నుంచి 31 మంది వరకు ఉన్నారు.
*శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా మళ్లించే నీటిని తక్కువ చేసి చూపిస్తున్నారని, తనిఖీకి అనుమతించడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణానదీ యాజమాన్యబోర్డుకు ఫిర్యాదు చేసింది.
*కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్శర్మ అన్నారు. పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పంప్హౌస్ను శుక్రవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.
*కృష్ణా బేసిన్లో సెప్టెంబరు ఆఖరు వరకు సాగు, తాగునీటి అవసరాలకు 50.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది.
*దేశవ్యాప్తంగా డిసెంబరు 8వ తేదీన సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్)కు ఈ నెల 19నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలో మొత్తం 110 నగరాలు, పట్టణాల్లో 20 భాషల్లో ఈ పరీక్ష జరుపుతారు. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబరు 18వ తేదీ తుది గడువు. రుసుమును మాత్రం ఆ నెల 23న మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.
చంద్రబాబు ఇంటికి నోటీసులు -తాజా వార్తలు – 08/17
Related tags :