* ఎన్నికల్లో ఓటమి తర్వాతనైనా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని మార్చుకుంటారనుకున్నాం..కానీ, ఆయన ఇప్పుడు మరింత దిగజారిపోయారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ను విమర్శించడంలో చంద్రబాబు భాష మార్చుకోవాలని సూచించారు.
*మండిపడుతున్న కన్నా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనపై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ మండిపడుతున్నారు. అదేవిధంగా… ప్రతి పక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటాన్ని కూడా కన్నా తప్పుపట్టారు. ఓ వైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… ఏమీ పట్టనట్లు… వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంతకీ మ్యాటరేంటంటే… వరదల దాటికి కృష్ణా నది పొంగి పొర్లుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురౌతున్నాయి. దీంతో… ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరకట్ట సమీపంలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్దకు కూడా వరద నీరు చేరుకుంది.ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదమే నడుస్తోంది. ఇదిలా ఉంటే వరదల కారణంగా సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయితే.. ప్రజల గురించి మాత్రం అధికార, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడం లేదని కన్నా మండిపడుతున్నారు.
* వరద బాధితులను ఆదుకోవాలి: చంద్రబాబు
వరద బాధితులకు తెదేపా నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జులు, ఇతర నేతలు పాల్గొనాలన్నారు. బాధిత ప్రజానీకానికి అందరూ సంఘీభావంగా ఉండాలని సూచించారు. కృష్ణా నది వరదల్లో అనేక మంది నిరాశ్రయులు అయ్యారని, ఇళ్లు నీటమునిగి కట్టుబట్టలతో మిగిలారన్నారు. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. పసుపు, కంద, నిమ్మ, అరటి, కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
* భాజపాలో చేరిన కపిల్ మిశ్రా
మాజీ మంత్రి, ఆప్ తిరుగుబాటు నేత కపిల్ మిశ్రా భాజపాలో చేరారు. ఆప్ మహిళా విభాగం చీఫ్ రిచా పాండేతో కలిసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కపిల్ మిశ్రా భాజపాకు అనుకూలంగా ప్రచారం చేశారు. దిల్లీలోని కార్వాల్‌నగర్ నుంచి ఆప్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కపిల్ మిశ్రా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ ఇటీవల అనర్హత వేటు వేశారు. దీంతో తనపై అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు.
*జనసేనను కలిపేయాలని ఆ పార్టీ ఒత్తిడి తెస్తోంది : పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెల్చుకున్న జనసేన… విజయం వైపు అది తమ తొలి అడుగు అని చెబుతోంది. సీట్లు రాకున్నా..ఓట్లు మాత్రం ఆశజనకంగా ఉన్నాయని ఇది తమ నైతిక విజయం అని ప్రకటించుకుంది. జనసేన బలోపేతంపై దృష్టి సారిస్తూనే విలువల రాజకీయం చేస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్.ఎన్నికల తర్వాత జనసేనను తమలో కలిపేయాలని ఓ జాతీయ పార్టీ ఒత్తిడి తెస్తోందని అన్నారు పవన్. అయితే..తాను అలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి పార్టీని విలీనం చేయబోనని తేల్చి చెప్పేశారు. జాతీ సమగ్రత, విలువలు, ప్రజల కోసమే జనసేన ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్..పార్టీ కోసం అభిప్రయాలను నేరుగా చెప్పాలని..సోషల్ మీడియాలో హడావుడి చేయొద్దని సూచించారు.
* హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ఆలోచన లేదు
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తుందని భావిస్తే… ఈ రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్. కరీంనగర్ లోని హోటల్ మైత్రీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ లో గ్రానైట్, ఇసుక మాఫియా సహజ సంపదను దోచేస్తోందని అన్నారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని.. దేశమంతటా జరిగిన ఓ సర్వేలో తేలిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. 70 శాతం ప్రజలకు… డబ్బులు ముట్టజెప్పందే పని కావడం లేదన్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల్లో ఉపయోగించారనీ.. పేదల సంక్షేమం స్కీంలన్నింటిలోనూ స్కాంలే ఉన్నాయన్నారు. చంద్రబాబును బూచిగా చూపి అధికారంలోకి వచ్చారని విమర్శించారు లక్ష్మణ్.
*ఏ ఆడబిడ్డా నెత్తిన బిందె ఎత్తుకుని నడవకుండా చేస్తాం: పోచారం
రూ.2 కోట్ల 80 లక్షలతో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమాజంలో మానవ జన్మకు… తోడు, నీడ తప్పనిసరి అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన చిరకాల స్వప్నమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏ ఆడబిడ్డా నెత్తిన బిందె ఎత్తుకుని నడవకూడదనే సంకల్పంతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద వారందరికీ రెండు పడకల ఇళ్లు కట్టించి తీరుతామన్నారు. స్థానికులకు మాత్రమే ఇళ్లను కేటాయిస్తామన్నారు.
*చంద్రబాబు టార్గెట్‌గా వైసీపీ రాజకీయాలు: బోండా ఉమ
చంద్రబాబును టార్గెట్ చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శించారు. హైసెక్యూరిటీ జోన్‌లోకి డ్రోన్లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. డీజీపీ అపాయింట్‌మెంట్‌లో దొరకలేదన్నారు. ఐజీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. భారీ వరదలు వచ్చినా గతంలో ఫ్లడ్ మానిటరింగ్ చేశారని చెప్పారు. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. లంక గ్రామాలు మునగలేదన్నారు. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
*చంద్రబాబు ఇంటికి నోటీసులు
కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో విజయవాడ కృష్ణా కరకట్ట వెంటఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసంలో ప్రస్తుతం ఎవ్వరూ లేకపోవడంతో స్థానిక వీఆర్వో ప్రసాద్ నోటీసును గోడకు అంటించారు. వరదల వల్ల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా ముందుజాగ్రత్తగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తాడేపల్లి తహసీల్దార్ పేర్కొన్నారు. వరదల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నోటీసుల్లో కోరారు.
*వరద నీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం
కృష్ణా నది వరద నీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్లే ముంపు పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కేవలం మూడు రోజుల్లో 8లక్షల క్యూసెక్కుల వరదనీటిని డెల్టా ప్రాంతాలపైకి వదలడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబులతో కలిసి శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
*అమిత్షాతో సీఎం రమేష్ భేటీ
భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఏపీ భాజపా ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. ఇటీవల భాజపాలో చేరిన.. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్విప్ భువనేశ్వర్ కలితా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరికల గురించి సీఎం రమేష్ అమిత్షాకు వివరించినట్లు తెలిసింది.
*వేలకోట్లు దోచినవారు నీతివ్యాఖ్యలా?
వేల కోట్ల రూపాయలు దోచేసి అకస్మాత్తుగా నీతివంతమైన పాలన అందిస్తామని చెబితే ప్రజలు నమ్మరని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరి జనసేన కార్యాలయంలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు.
*రైల్వే బడ్జెట్ విడిగా ఉండాలి: మాజీ ఎంపీ వినోద్
సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్నీ కలిపేయడంతో రైల్వేరంగం ప్రాధాన్యం కోల్పోతోందని తెరాస సీనియర్ నేత- మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ఆయన శుక్రవారం దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయంలో..అధ్యక్షుడు యాదవ్రెడ్డి, కార్యదర్శి రవీందర్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాత విధానం ప్రకారమే రైల్వేబడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రయాణికుల సంక్షేమ సంఘాలు, ప్రజా సంస్థలు, రైల్వే ఉద్యోగ-కార్మిక యూనియన్లతో పాటు ఉద్యమించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.
*రైల్వే బడ్జెట్ విడిగా ఉండాలి: మాజీ ఎంపీ వినోద్
సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్నీ కలిపేయడంతో రైల్వేరంగం ప్రాధాన్యం కోల్పోతోందని తెరాస సీనియర్ నేత- మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ఆయన శుక్రవారం దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయంలో..అధ్యక్షుడు యాదవ్రెడ్డి, కార్యదర్శి రవీందర్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
*నియమిత పదవులపై సీఎం కసరత్తు
తెలంగాణలో వివిధ నియమిత పదవుల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి శుక్రవారం ఆయన కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వినోద్కుమార్కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. గతంలో ఈ పదవిని ప్రస్తుత మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిర్వహించారు.
*బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచాలి: వీహెచ్
బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దిల్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్గాంధీ ఫెలోషిప్ ఇచ్చేవారని.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇవ్వడం లేదన్నారు. రాజీవ్గాంధీ పేరుమీద ఇవ్వడం ఇష్టంలేకపోతే ఏదో ఓ పేరు పెట్టైనా నిధులు విడుదల చేయాలని కోరారు. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచేందుకు సీఎంలు కేసీఆర్, జగన్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
*యురేనియం తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలి
నల్లమలలో యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యురేనియం నిక్షేపాలను వెలికితీసే చర్యల వల్ల చెంచుల జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని, మూగజీవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో నాగర్కర్నూల్, దేవరకొండ, నాగార్జునసాగర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. యురేనియం తవ్వకాలు, వాటివల్ల కలిగే దుష్పరిణామాలపై చర్చించారు.
*బకాయిల తెలంగాణగా మార్చారు: లక్ష్మణ్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తుస్సుమనిపించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఉద్యోగులకు పీఆర్సీ, వయోపరిమితి పెంపు ఊసే మరిచిపోయారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని.. బంగారు తెలంగాణను బకాయిలు, బాధల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.
*మాజీ ఎంపీ కవితతో నామా భేటీ
తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు శుక్రవారం హైదరాబాద్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాలు, జాతీయ రాజకీయాలు, విభజన హామీలు, దిల్లీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి చర్చించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన తెలంగాణ సమస్యల గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ కర్మాగారం, బయ్యారం ఉక్కు పరిశ్రమ, నిజామాబాద్లో పసుపు బోర్డు సాధన తదితర అంశాలను కవిత ప్రస్తావించారు.
*నెహ్రూపై విమర్శలను తిప్పికొట్టాలి: ఉత్తమ్
నవ భారత నిర్మాణానికి బీజం వేసిన జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీభవన్లో 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఉత్తమ్కుమార్రెడ్డి ఆవిష్కరించారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీమంత్రి షబ్బీర్అలీ, మర్రి శశిధర్రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లురవి, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ తదితరులు హాజరయ్యారు.
*కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కల్పిస్తాం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెరాస ప్రభుత్వం నియంతృత్వంగా పాలిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబ పాలన పట్టిపీడిస్తోందని.. విముక్తి కల్పించే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజలు తమ పార్టీతో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్రదిన వేడుకల్లో లక్ష్మణ్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతామని చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, శేషగిరిరావు, మాజీ ఎంపీ జి.వివేక్, నేతలు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, పొంగులేటి సుధాకర్రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చంద్రబాబు వైఖరి మారాలి: ఉమ్మారెడ్డి
ఎన్నికల్లో ఓటమి తర్వాతనైనా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని మార్చుకుంటారనుకున్నాం..కానీ, ఆయన ఇప్పుడు మరింత దిగజారిపోయారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ను విమర్శించడంలో చంద్రబాబు భాష మార్చుకోవాలని సూచించారు.
*జగన్ వచ్చారని వరుణుడు పారిపోయాడా?
సాగునీరు లేక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోందని, చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేర్కొన్నారు. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతముందని, మిగిలిన పది జిల్లాల్లో లోటు వర్షపాతమేనని తెలిపారు. తాగేందుకు నీరివ్వాలంటూ చాలా చోట్ల జనాలు ఆందోళనకు దిగుతున్నారని వెల్లడించారు. ‘‘జగన్ను అపరభగీరథుడన్న నేతల్లారా.. వరుణుడు ఏమయ్యాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా?’’అని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్లో వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు తలనొప్పిగా మారిన కోడెల-రాజకీయ–08/17
Related tags :