ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ఇన్‌షా అల్లా’ సినిమాలో అవకాశం రావడంతో ఎగిరి గంతేశారట బాలీవుడ్ నటి ఆలియాభట్. అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా ఆలియాను తీసుకున్నారు. ఈ విషయాన్ని నటికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఎగిరి గంతేశారట. భన్సాలీ దర్శకత్వంలో నటించాలన్నది తన కల అని ఓ సందర్భంలో ఆలియా చెప్పారు. ఈ సినిమాతో ఆమె కల నెరవేరబోతోంది. ఈ సందర్భంగా ఆలియా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫోన్ రాగానే ఎగిరి గంతేశాను. ఆ సమయంలో నేను భారత్‌లో లేను.. విదేశాల్లో ఉన్నాను. విషయం వినగానే దాదాపు 5 నిమిషాల పాటు పైకి, కిందకు దూకి గంతులేశాను. ఎందుకంటే కథ నాకు నచ్చింది. చాలా ఉత్సుకతగా అనిపించింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మొదటిసారిగా సల్మాన్ సరసన ఆలియా నటిస్తుండటం విశేశం. ప్రస్తుతం ఆలియా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘తఖ్త్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇన్‌షా అల్లా
Related tags :