Business

YSR పేరు మీదుగా తిరిగి తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు

Anna canteens to re-open on YSRs name

100 రూపాయల విలువ చేసే భోజనం కేవలం 5 రూపాయల కు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కొత్త పేరుతో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి, భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది, గత నెల 31న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి విదితమే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను టీడీపీ సర్కారు ఏర్పాటు చేసింది. వీటి మూసివేత వలన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది,అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందాయి, ఇక అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై స్పష్టత రావాల్సివుంది.