బాలీవుడ్ గ్రీక్‌గాడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్‌కు ప్రపంచంలోనే అత్యంత అందగాడిగానూ బిరుదు ఉంది. హాలీవుడ్ నటులు క్రిస్ ఇవాన్స్, రాబర్ట్ ప్యాటిన్సన్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హ్యామ్ వంటి స్టార్ సెలబ్రిటీలను దాటి హృతిక్ ‘వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దీని గురించి బాలీవుడ్ మీడియా వర్గాలు హృతిక్‌ని ప్రశ్నిస్తూ.. ‘మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉండటానికి రహస్యం ఏంటి?’ అని అడిగాయి. ఇందుకు హృతిక్ స్పందిస్తూ.. ‘బ్రోకోలీ’ అని చమత్కరించారు. ఆ తర్వాత నవ్వుకుంటూ.. ‘జోక్ చేశాను. అందగాడు అన్న బిరుదును నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది నాకు గొప్ప విషయమేమీ కాదు. నా ఉద్దేశ్యంలో అందం అనేది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మంచి మనస్తత్వాన్ని మించిన అందం ఉండదు’ అని చెప్పుకొచ్చారు. హృతిక్ నటించిన ‘సూపర్ 30’ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఆయన ‘వార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది.
గ్రీకు వీరుడి బ్రొకోలి
Related tags :