కావలసినవి:
మటన్: ముప్పావుకిలో, బాస్మతిబియ్యం: కిలో, పాలు: 200 మి.లీ., పెరుగు: 2 టీస్పూన్లు, శొంఠిపొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, కెవ్రా ఎసెన్స్: పావుటీస్పూను, కుంకుమపువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, గరంమసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం:
* బాణలిలో నెయ్యి వేసి కాగాక ఇంగువ, మటన్ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. అందులోనే పెరుగు కూడా వేసి కలిపి రంగుమారేవరకూ వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, సొంఠిపొడి, పలావు ఆకు వేసి కాసేపు వేయించాలి. తరవాత అరలీటరు నీళ్లు పోయాలి. అరటీస్పూను గరంమసాలా, టీస్పూను సోంపుపొడి వేసి సిమ్‌లో ఉడికించి దించాలి. మటన్‌ముక్కల్ని విడిగా ఓ గిన్నెలో వేసి ఉంచాలి. అదే బాణలిలో రెండు లీటర్ల నీళ్లు పోసి ఉప్పు వేయాలి.
* ఇప్పుడు గరంమసాలా మిగిలిన సోంపు పొడి అన్నీ పలుచని బట్టలో మూట కట్టి నీళ్లలో వేయాలి. తరవాత బియ్యం వేసి సిమ్‌లో సగం ఉడికేవరకూ ఉంచి దించాలి. తరవాత అందులోనుంచి నీళ్లు వంపేసి మటన్ ముక్కలూ అన్నమూ పొరలు పొరలుగా మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి సిమ్‌లో దమ్ చేయాలి.