NRI-NRT

యార్లగడ్డకు నాట్స్ అభినందన

యార్లగడ్డకు నాట్స్ అభినందన-NATS Team Meets And Congratulates Yarlagadda Lakshmi Prasad

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమితులైన మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు నేతృత్వంలోని బృందం శనివారం నాడు డల్లాస్‌లో కలిసి అభినందనలు తెలిపింది. ఆయన సారథ్యంలో ఏపీలో తెలుగు భాష మరింతగా వృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపు తదితరులు పాల్గొన్నారు.