Movies

జరీన్ వెడ్స్ సల్మాన్

జరీన్ వెడ్స్ సల్మాన్

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు నటి జరీన్‌ ఖాన్‌. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు జరీన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో విలేకరి జరీన్‌కు ఓ టెస్ట్‌ పెట్టారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అన్నారు. ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది జోక్‌గా మారిపోయింది’ అన్నారు. సల్మాన్‌, జరీన్‌ జంటగా ‘వీర్‌’ చిత్రంలో నటించారు. జరీన్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది సల్మానే.