ఎలాంటి కుట్ర లేదు…. ఈ విషయమై రాజకీయం చేయకూడదని డీజీపీ గౌతం సవాంగ్ టీడీపీ నేతలకు సూచించారు.చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ వినియోగంపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
సోమవారం నాడు డీజీపీ గౌతం సవాంగ్ ను ఈ విషయమై స్పందించారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను ఎలా ఉపయోగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ కెమెరాను ఉపయోగించారని డీజీపీ వివరించారు. డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని డీజీపీ అభిప్రాయపడ్డారు.
డ్రోన్ కెమెరాను ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతిని తప్పకుండా తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించడంపై ఎలాంటి కుట్ర లేదని ఆయన తేల్చేశారు. ఈ విషయమై రాజకీయం చేయకూడదని టీడీపీ నేతలకు డీజీపీ సూచించారు.