Food

క్యారెట్ కిల్స్ క్యాన్సర్

Eat tons of carrots to stay away from cancer

ఆల్ఫా కెరొటిన్లు క్యారెట్లలో చాలా ఎక్కువ. ఇవి గుమ్మడి కాయలోనూ దండిగానే లభిస్తాయి. వీటిలోని ఫాల్కారినాల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందట. క్యారెట్‌ ముక్కలు లేదా జ్యూస్‌ని ఓ అరకప్పు మోతాదులో రోజుకి రెండు సార్లు తీసుకుంటే అండాశయ క్యాన్సర్‌ వచ్చే ముప్పు తగ్గుముఖం పడుతుంది. ఇక బీటా కెరొటిన్లు ఆకుకూరలూ, నారింజ పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. బీటా కెరొటిన్లు ఒంట్లోకి చేరగానే విటమిన్‌-ఎ రూపంలోకి మారతాయి కూడా.