బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి రోజు పోటీల్లో భారత షట్లర్లకు మంచి ఫలితాలే లభించాయి. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. 19వ ర్యాంకు ఆటగాడైన ప్రణీత్ 21-17, 21-16 తేడాతో కెనడా క్రీడాకారుడు ఆంథోనీ హో షూ (66వ ర్యాంకు)ను వరుస గేముల్లో చిత్తు చేశాడు. మరో షట్లర్ ప్రణయ్ గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది. ఫిన్లాండ్‌కు చెందిన యూటు హీనోపై 17-21, 21-10, 21-11 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్ చేజార్చుకున్న అతడు ఆ తర్వాత చెలరేగి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల డబుల్స్‌లో మేఘనా జక్కంపూడి, పూర్వీషా రామ్ 21-10, 21-18 తేడాతో గ్వాటెమాల జోడీ డయానా కార్లెటో, నిక్తె అల్గెజాండ్రపై విజయం సాధించారు. ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్, పదో సీడ్ సమీర్ వర్మ ఇంకా ఆడాల్సి ఉంది.
స్విట్జర్‌ల్యాండ్‌లో భారత షట్లర్ల హవా
Related tags :