బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. 13 ఏళ్ల పాటు తెరకు దూరమైనా యోగా వీడియోలు చేస్తూ బిజీగా గడిపారు. ఇప్పుడు ఇదే ఫిట్‌నెస్‌కు సంబంధించి ఓ కంపెనీ ఆమెకు ఓ ఆఫర్ ఇచ్చింది. ప్రముఖ ఆయుర్వేద కంపెనీ స్లిమ్మింగ్ పిల్స్(సన్నబడటానికి వాడే మాత్రలు)కు ప్రచారకర్తగా వ్యవహరించాలని అందుకు గానూ రూ.10 కోట్లు ఇస్తామని సదరు కంపెనీ చెప్పింది. అందుకు శిల్ప అంగీకరించలేదు. తాను నమ్మని విషయాలను ప్రజలకు చెప్పలేనని కరాఖండిగా చెప్పేసింది.
నేను నమ్మను. ₹10కోట్లు నాకొద్దు.
Related tags :