సౌందర్య పరిరక్షణలో షీట్ మాస్కుల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది. ఫేస్ ప్యాక్‌లకు బదులుగా వీటిని నేరుగా ముఖంపై పూతలా వేసుకోవచ్చు. ఒకప్పుడు జపాన్, దక్షిణ కొరియాలకే పరిమితమైన షీట్ మాస్కులు ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించాయి. ముఖానికి క్రీమ్‌లతో ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం పాత పద్ధతి. ఈ షీట్‌లు ముఖానికి సరిపోయే కొలతల్లో లభిస్తాయి. పాలిథీన్ లేదా ఫైబర్ షీట్లను ఇందుకోసం ఉపయోగిస్తారు. వీటిని కీరా, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి… వంటి పండ్ల రసాల్లో ముంచుతారు. తరువాత కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను వాటికి పూతలా వేస్తారు. ప్యాకింగ్ నుంచి తీసి, నేరుగా ముఖానికి అంటుకునేలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత దాన్ని తీసివేయాలి. దానికి అంటుకొని మిగిలిపోయిన లేపనాన్ని చేత్తో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. ఆరాక దాన్ని తొలగించి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా పదిహేను రోజులకోసారైనా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
షీట్ మాస్కులు ప్రయత్నిస్తారా?
Related tags :