ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్‌గానే పరిగణిస్తున్న ఈ యాప్ ఇకపై ‘వాట్సాప్ బై ఫేస్‌బుక్’ అని యూజర్లకు కనిపించనుంది. ప్రస్తుతం బీటా (2.19.228) యూజర్లకు ఇది దర్శనమిస్తుండగా.. త్వరలో అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది. అయితే, ఇది కేవలం పేరులో మార్పు తప్ప.. యాప్‌లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.
వాట్సాప్ సరికొత్త నామధేయం…WhatsApp By FaceBook
Related tags :