భూత, ప్రేత కథలను చూపిస్తానంటున్నారు జాన్వీ కపూర్. భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ కావాలనే షరతు కూడా పెట్టారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో సత్తా చాటేందుకు తొలిసారి ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్కు సైన్ చేశారు జాన్వీ కపూర్. జాన్వీకి జోడీగా ‘గల్లీభాయ్’ ఫేమ్ విజయ్ వర్మ నటిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో బాగా పాపులరైన ‘లస్ట్స్టోరీస్’కు దర్శకత్వం వహించిన జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీల ఆధ్వర్యంలో ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ రూపొందనుంది. ‘లస్ట్ స్టోరీస్’ మాదిరిగానే ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందనున్న భాగంలో జాన్వీ, విజయ్ నటిస్తారు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది. మరి.. లస్ట్స్టోరీస్లా ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ సిరీస్ కూడా డిజిటల్ ఆడియన్స్ను మెప్పిస్తుందా? వెయిట్ అండ్ సీ.
దడిపిస్తా
Related tags :