వరంగల్ చాందినీగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మస్త్ హుషారైన పాత్ర చేశారు నభా నటేశ్. ఇపుడు మాస్ రాజా రవితేజతో ‘డిస్కో రాజా’ చేస్తున్నారు నభా. హీరోయిన్గా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారని తెలిసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జె.భగవాన్, పుల్లయ్య నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేశ్ను ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు సాయిధరమ్. ఈ సినిమా పూర్తి కాగానే దేవా కట్టా సినిమా ప్రారంభం అవుతుంది.
నభా హవా
Related tags :