Business

చౌకగా SBI కారు రుణాలు

SBI Car Loans Becomes Much Cheaper

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్బీఐ ముందుగానే తన కస్టమర్లకు ఈ శుభవార్త అందించింది. కార్ల రుణాల పై 8.70శాతం వడ్డీని వసూలు చేయనుంది. యోనో యాప్ లేదా బ్యాంకు వెబ్ సైటు ద్వారా ఆన్ లైన్ లో కారు ఋణం కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు వడ్డీ రేటు పై మరో 25 బీపీఎస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులైన బ్యాంకు కస్టమర్లు కారు ఆన్ రోడ్ ధరలో తొంభై శాతం వరకు రుణాన్ని పొందచ్చు.