ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారనుందని.. దీనిపై కేంద్రంలోని పెద్దల నుంచి తనకు సమాచారముందని చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి సౌకర్యాలూ లేని దొనకొండ కంటే తిరుపతి కొండ అయితే రాజధానికి బాగుంటుందని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. దొనకొండ విషయంలో తొందరపడొద్దని సీఎం జగన్‌కు ఆయన సూచించారు. అక్కడ జలవనరులు, రైల్వే, రవాణా సౌకర్యాలు లేవని చెప్పారు. తిరుపతి కాకుండా రాజధానిగా ఇంకా ఏ ప్రాంతమైనా నిలబడదన్నారు. తిరుపతిని రాజధాని చేయాలని 2013లోనే తాను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖరాసినట్లు చింతా మోహన్ గుర్తు చేశారు.
అమరావతి నుండి దోనకొండకు రాజధాని
Related tags :