NRI-NRT

డల్లాస్‌లో జగన్ జ్యోతి వెలిగించడానికి నిరాకరించారా? డా.లక్కిరెడ్డిని స్టేజి నుండి దింపేశారా? వాస్తవం ఎంత ?–TNI ప్రత్యేకం

Did Jagan Reject Lighting A Lamp? How much truth is in this topic?-డల్లాస్‌లో జగన్ జ్యోతి వెలిగించడానికి నిరాకరించారా? డా.లక్కిరెడ్డిని స్టేజి నుండి దింపేశారా? వాస్తవం ఎంత ?–TNI ప్రత్యేకం

ప్రస్తుతం ఎన్నికలు జరిగి జగన్ ముఖ్యమంత్రి అయ్యి రోజులు గడవక ముందే ఆయన పైన గిట్టని వాళ్ళు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నారు. జగన్ ఇంకా ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంటాడన్న విషయాన్నీ ఆయన వ్యతిరేకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ కు సంబందించిన ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూపిస్తున్నారు. తాజాగా జగన్ డాలస్ పర్యటనలో ఆయన హిందూ సంప్రదాయాలను పాటించడం లేదంటూ కొందరు గోగ్గోలు పెడుతున్నారు. సభ ప్రారంభానికి ముందు జ్యోతి వెలిగించడానికి నిరాకరించారని ఓ ప్రచారం చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు ప్రముఖ వైద్యుడు, దాత డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డిని వేదిక పై నుండి దించివేశారని ఆయనకు అవమానం జరిగిందని ప్రచారాలు ప్రారంభించారు. ఈ విషయాలకు సంబంధించిన వాస్తవాల పై ట్ణీ వివరాలు సేకరించింది. డాలస్ సభ నిర్వాహకులు ఈ ఆరోపణలు ఖండిస్తున్నారు. డా. హనిమిరెడ్డి కూడా ఇవి అబద్దం అంటూ వివరణ ఇచ్చారు. వాస్తవానికి జగన్ కు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నుదుటున బొట్టు పెట్టారు. ఈ రెండింటిని ఆయన హుందాగానే స్వీకరించారు. ఇటువంటప్పుడు జ్యోతి వెలిగించడానికి ఆయన ఎందుకు వెనకాడతారని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రసంగించిన కన్వెన్షన్ సెంటర్ లో జ్యోతిని వెలిగించడానికి అక్కడ ఉన్న సెక్యురిటీ సిబ్బంది అంగీకరించలేదు. కొవ్వొత్తి గాని, లైటరు కానీ, అగ్గిపుల్ల కానీ ఉపయోగించవద్దని ఆ మేరకు నిబంధనలు ఉన్నాయని సెక్యురిటీ సిబ్బంది ముందుగానే నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో జగన్ ను ఎలక్ట్రిక్ బటన్ తో జ్యోతి వెలిగించమని నిర్వాహకులు కోరారు. ఈ సమయంలో ఫోటోలకు ఫోజు ఇవ్వమని కోరగా ఈ సమయంలో ఎందుకని జగన్ అన్నారు. దానిపై జగన్ జ్యోతి వెలిగించడానికి సిద్దపడలేదని ఆయన హిందూ ధర్మాన్ని గౌరవించడం లేదని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవం కాదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

*** ఆ ప్రచారం తప్పు: డా.లక్కిరెడ్డి
తనను జగన్ సభలో వేదికపై నుండి దింపి వేశారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి TNIకి తెలిపారు. స్టేజిపై రద్దీగా ఉండటం, కుర్చీలు తక్కువగా ఉండటం, తనకన్నా ప్రముఖులు ఎక్కువగా ఉండటంతో వారు కూర్చోవడానికి వీలుగా తాను వేదిక నుండి కిందకు దిగానని డా. హనిమిరెడ్డి తెలిపారు. జగన్ బస చేసిన హోటల్ గది ముందు గంట సేపు వేచి ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. వాస్తవానికి గత నెలలోనే జగన్ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసానని అరగంట సేపు ఆయనతో భేటీ అయ్యానని తెలిపారు. ఈ భేటీకి సంబందించిన ఫోటోలు అందించారు. డా.రాజశేఖరరెడ్డి కుటుంబంతో తమకు సుధీర్గ కాలం నుండి సన్నిహిత, బంధుత్వాలు ఉన్నాయని రాజశేఖరరెడ్డి అమెరికాలోని ‘మర్సడ్’ లోనూ, మైలవరంలో ఉన్న తమా నివాసాలకు వచ్చారని, ప్రస్తుత సిఎం జగన్ తోనూ తమకు అనుబంధం కొనసాగుతోందని హనిమిరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో అమెరికాకు చంద్రబాబు వచ్చినా, రాజశేఖరరెడ్డి, జగన్ లు వచ్చిన సమయంలో అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు వారిని తమ ప్రతినిధులుగా గౌరవించాలని, అనవసర విషయాలను ప్రస్తావించకూడదు అని డా.హనిమిరెడ్డి తెలిపారు.