అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా పదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ భార్య లారా ఓ ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎరిక్ ట్విట్టర్ ద్వారా ట్రంప్ వెల్లడించారు.ఆ చిన్నారికి కరోలినా డోరోతి అని పేరు పెట్టారని పేర్కొన్నారు. ఎరిక్ దంపతులకు ఇది రెండో సంతానం. వారి మొదటి సంతానమైన ఎరిక్ ల్యూక్ ట్రంప్ కు ఈ సెప్టెంబరుతో రెండేళ్లు పూర్తవుతాయి. డొరోతితో కలుపుకుని డొనాల్డ్ ట్రంప్ మనవలు, మనవరాళ్ల సంఖ్య పదికి చేరింది. 73 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యల ద్వారా అయిదుగురు సంతానం ఉన్నారు. వీరిలో మొదటి ఇద్దరు డొనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్. ఇక మూడో సంతానంగా ఎరిక్ ఉన్నారు. వీరి తర్వాత తిఫ్ఫానీ ట్రంప్, బ్యారన్ ట్రంప్ లు కూడా ఉన్నారు. ఇక ట్రంప్ ఆర్గనైజేషన్‌లో తన సోదరుడు జూనియర్ ట్రంప్ తో కలిసి ఎరిక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఇక, 36 ఏళ్ల లారా ట్రంప్ మాజీ జర్నలిస్ట్. ట్రంప్ 2020 రీఎలక్షన్ ప్రచారంలో సీనియర్ అధికారి.
పదోసారి తాతయ్య
Related tags :