*కియా సెల్టోస్ కార్లు ఈ నెల 22న మార్కెట్‌లోకి రానున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ఊపందుకుంది. ఇప్పటికే కియా డెమో కార్లు పలు షోరూమ్‌లకు చేరాయి. ఈనెల 22న షోరూమ్‌ల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. దేశవ్యాప్తంగా 180 కియా కార్ల విక్రయశాలలు ఉండగా.. స్థానిక పరిశ్రమ నుంచి సెల్టోస్ కార్లను ట్రక్కుల్లో తరలిస్తున్నారు. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 30,500 మంది వినియోగదారులు కియా కార్లను బుక్ చేసుకున్నారు. పరిశ్రమలో రోజుకు 285 కార్ల వరకు ఉత్పత్తి అవుతుండగా.. వినియోగదారుల బుకింగ్ మేరకు మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.
* బంగారం ధర ఎంత ఉన్నా కొనడం మానొద్దని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ స్పష్టం చేశారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే భవిష్యత్‌లో అన్ని లాభాలు ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకున్నా, పెట్టుబడులపై లాభాలు రావడం లేదన్నారు. క్రిప్టోకరెన్సీల దూకుడు పెరుగుతున్నా, వాటిని నమ్మలేమని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తే బంగారం వంటి వాటిపై పెట్టుబడులు మేలని మొబియస్ స్పష్టం చేశారు. పెట్టుబడుల్లో కనీసం పదిశాతమైన విలువైన లోహాల కొనుగోలుకు కేటాయించాలని సూచించారు. బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా గత నెల నుంచి స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు వస్తున్నాయి. చైనా–అమెరికా వ్యాపార ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా మనదేశంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. పది గ్రాముల ధర రూ.40 వేలకు చేరింది.
* క్లాసిక్ పోలో బ్రాండ్ పేరుతో దుస్తులను ఉత్పత్తి చేస్తున్న రాయల్ క్లాసిక్ మిల్స్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.
*విమానాశ్రయ విభాగంలోకి వ్యూహాత్మక పెట్టుబడులను ఆహ్వానించిన జీఎంఆర్ ఇన్ఫ్రా, దీన్ని ఇతర వ్యాపారాల నుంచి వేరు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
*డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు ఆంధ్రప్రదేశ్ దువ్వాడలో ఉన్న ప్లాంటులో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు మంగళవారం పూర్తయ్యాయి.
*రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) సిద్ధమవుతున్నాయి.
*శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10+ స్మార్ట్ఫోన్లను ఈనెల 23 నుంచి దేశీయంగా విక్రయించనుంది. 12 జీబీ ర్యామ్- 256-512 జీబీ మెమొరీలతో లభించే నోట్ 10+ ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీతో లభించే నోట్ 10 ధర రూ.69,999 అని సంస్థ తెలిపింది.
*ఇసుజు మోటార్స్ ఇండియా నుంచి పరిమిత శ్రేణి వేరియంట్ స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) వీ-క్రాస్ విపణిలోకి విడుదలైంది.
*హ్యుందాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’ను మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. ధరల శ్రేణి రూ.4.99-7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుంది.
*ప్రసార మాధ్యమాల్లో డిజిటల్ వాటా శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2024కు ఇతర మాధ్యమాల కంటే పెద్దదిగా డిజిటల్ అవతరిస్తుందని, 39.5 శాతం వాటా పొందుతుందని కేపీఎంజీ అంచనా వేస్తోంది.
నేడు మార్కెట్‌లోకి కియా కారు-వాణిజ్య-08/21
Related tags :