తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆద్వర్యంలో బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా డాలస్ నగరంలో 250 మంది పేద విద్యార్ధులకు బ్యాగులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి తానా అద్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్థానికంగా ఉన్న టాంటెక్స్ తెలుగు సంఘం నిర్వాహకులు దీనికి సహకరించారు. తానా మాజీ అద్యక్షుడు తోటకూర ప్రసాద్, డాలస్ ఏరియా తానా నిర్వాహకులు దొడ్డా సాంబా, మురళి వెన్నం, లోకేష్ నాయుడు. కొడాలి ప్రవీణ్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా బృందం, మాజీ అద్యక్షులు బ్యాక్ ప్యాక్ పధకం రూపకర్త డా.గొర్రెపాటి నవనీతకృష్ణతో సమావేశమయ్యారు.
డాలస్ లో తానా బ్యాగుల పంపిణి
Related tags :