* ఈ నెల 26న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ ప్రారంభించనుందివిజయవాడ-విశాఖ మధ్య డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఉదయ్‌ను ప్రారంభించనున్నారు.పూర్తి ఏసీ బోగీలతో నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఉదయ్‌కు పచ్చజెండా ఊపనున్నారు.
ఈ నెల 26న విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి ప్రారంభించనున్నారు. 27 నుంచి ప్రయాణికులకు అవకాశం కల్పిస్తారు. ఉదయం 5.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి… 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30కి బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరిగి విశాఖ చేరుతుంది.
* అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్ కచ్ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచావుకు 6 కిలోమీటర్ల వాయువ్య దిశలో సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు భూకంపం సంభవించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు..
* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టర్లను కోరారు.
* ప్రమాదకర స్ధాయిని మించి యమునా నదిలో వరద ప్రవాహంయమునా నదిలో 206.40 మీటర్లకు చేరిన వరద ప్రవాహం
పాత ఢిల్లీ ఇనుప వంతెనపై రాకపోకలు నిలిపివేసిన అధికారులుయమునా నదిపై రైళ్ళ రాకపోకల దారి మళ్ళించి న అధికారులురేపు మధ్యాహ్నానికి వరద ప్రవాహం 207.08 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు
*కృష్ణాజిల్లానూజివీడు మండలం అన్నవరం శివారు వెంకటాద్రిపురం పాపన్న చెరువు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లుని అర్ధరాత్రి సీజ్ చేసిన అధికారులు.మరో 2 ట్రాక్టర్లు తో పరారైన తోలకందారులు ఒక్కో ట్రాక్టర్ 4వేలు నుండి 5వేలు వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నా తోలకందారులు. అర్ధరాత్రి తొలుతున్నా సమయంలో గ్రామస్థుల సమాచారంతోనే దాడి చేసి పట్టుకున్న అధికారులు.
*శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద 2 గేటు 10 అడుగులు ఎత్తి దిగివకు నీరు విడుదలఇన్ ఫ్లో :73,491 క్యూసెక్కులు
ఔట్ ప్లో : 1.66 లక్షల క్యూసెక్కులు నీటి నిల్వ సామర్థ్యం : 215 టిఎంసిలుప్రస్తుతం : 215.3263 టిఎంసిలు.పూర్తి స్థాయి నీటిమట్టం : 885డుగులుప్రస్తుతం : 884.90 అడుగులుకుడి , ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి
* తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్మించనున్నారు. ఇందుకు రూ. 82.50 లక్షలను కేటాయిస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌అండ్‌బీలోని బిల్డింగ్‌ల విభాగం ప్రతిపాదన మేరకు ప్రజాదర్బార్ నిర్మాణానికి ఈ నిధులను కేటాయించారు.
* పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ.. భారత్‌కు చెందిన ఏరోనాటికల్ ఇంజినీర్ సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్లో నిఖా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఫ్లైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ మెరిసిపోయారు. బ్లాక్ షేర్వానీలో హసన్, రెడ్ అండ్ గోల్డ్ డ్రెస్సులో ఆర్జూ ఆకట్టుకున్నారు. ఇద్దరూ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను బుర్జ్ ఖలీఫా ముందు జరిపారు. వలీమా కూడా దుబాయ్‌లోనే నిర్వహించనున్నారు.
*మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ బుధవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో భోపాల్ నగరంలోని నర్మద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. బీజేపీ నాయకుడైన బాబులాల్ పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వృద్ధాప్యంతో గత ఏడాది రాజకీయాల నుంచి వైదొలిగారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన బాబులాల్ 2004లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.
*వాయువ్య జార్ఘండ్, బిహార్ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.
*కోళ్ళ పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూసాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదేచేసారు. ఒక పావురం తక్కువ సమయంలో ఎంత దూరం చేరగాలదన్న పోటీ గుడ్ వీల్ ఫిజియన్ క్లబ్ నిర్వహించిన ఈ పోటీలో తర్ఫీదు పొందిన మూడు వందల పావురాలు తలపడ్డాయి. రత్నకుమార్ పావురం కేవలం పదకొండు రోజుల్లో 1750 కిమీల దూరం ఎగురుకుంటూ వెళ్లివచ్చి మొదటి బహుమతి కొట్టేసింది.
*కాంగ్రెస్ పార్టీ సేనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ను జమ్మూ-కాశ్మీర్ లో పర్యతించనివ్వకుండా పోలీసులు మంగళవారం జమ్మూ విమానాశ్రయంలోనే ఆపివేశారు. అక్కడి నుంచే దిల్లికి మరో విమానంలో వెనక్కి పంపారు. డిల్లి నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 2.45 గంటలకు జమ్మూ విమశ్రయానికి చేరుకున్నారు. ఆయనను బయటకి వెళ్ళకుండా అడ్డుకుని నాలుగు గంటలుకు డిల్లి పంపించి వేశారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్ శర్మ తెలిపారు.
*ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో యాషెస్‌తో మూడో టెస్టుకు దూరయ్యాడు. రెండో టెస్టు సందర్భంగా జోఫ్రా ఆర్చర్ బంతి బలంగా తగలడంతో అతడికి మెదడు గాయమైన సంగతి తెలిసిందే.
* ఒలింపిక్స్ హాకీ టెస్టు ఈవెంట్లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మన్‌దీప్‌సింగ్ హ్యాట్రిక్ సాధించడంతో మంగళవారం పురుషుల లీగ్ మ్యాచ్‌లో భారత్ 6-3తో ఆతిథ్య జపాన్ను ఓడించి ముందంజ వేసింది.
*ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో యాషెస్‌తో మూడో టెస్టుకు దూరయ్యాడు. రెండో టెస్టు సందర్భంగా జోఫ్రా ఆర్చర్ బంతి బలంగా తగలడంతో అతడికి మెదడు గాయమైన సంగతి తెలిసిందే.
*బ్యాటింగ్‌లో ఒక్కో రికార్డు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్న కోహ్లి.. ఈసారి కెప్టెన్సీలో ఒక పెద్ద రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించిపెట్టిన మహేంద్రసింగ్ ధోని (60 మ్యాచ్‌ల్లో 27) రికార్డుకు కోహ్లి (46 మ్యాచ్‌ల్లో 26) సమీపంగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ గెలిస్తే.. విరాట్.. మహిని సమం చేస్తాడు. ఈ జాబితాలో సౌరభ్ గంగూలీ (49 మ్యాచ్‌ల్లో 21) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్లలో గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా, 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు) ముందున్నాడు.
*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉన్న తాడేపల్లిలోని ప్రజాదర్బార్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.82.5 లక్షలతో దీని నిర్మాణానికి అనుమతిస్తూ రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ప్రజాదర్బార్ నిర్వహణకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో సీఎం నేరుగా వినతుల స్వీకరణకు అవకాశం ఉండటం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే బయటకు వచ్చి బాధితుల వద్ద వినతులు తీసుకొని సీఎం వద్దకు తీసుకెళ్తున్నారు. ప్రజాదర్బార్ అందుబాటులోకి వస్తే ఇక ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వినతులు తీసుకునేందుకు వీలు కలగనుంది.
*సదా ప్రజల గుండెల్లో ఉండే ఓ అరుదైన నిస్వార్ధ ప్రజా నాయకుడు మల్లెల అనంత పద్మనాభ రావు గారని, ఆయన సేవలు ఇబ్రహీంపట్నం తో పాటు కృష్ణా తీరంలోని పల్లెలన్నీ మరచిపోలేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
*బొబ్బిలి సాంఘిక సంక్షేమ వసతి గృహం (ఎస్సి హాస్టల్) లో బుధవారం ఎసిబి తనిఖీలు నిర్వహించింది. మెనూ అమలు, హాజరు వ్యత్యాసం, శానిటేషన్ వంటి అంశాలపై పరిశీలన చేపట్టింది. హాస్టల్లో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.
*బిహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
*దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బుధవారం హెచ్చరించింది. తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, యానాం, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
* వేంపల్లె..వేంపల్లె లో మానవతా శాంతి ర్యాలీలో మానవత్వం లోపించింది..ఉదయం నుంచి వర్షం జోరుగా కురుస్తున్న విద్యార్థులతో ఓ స్కూల్ కరస్పాండెంట్ శాంతి ర్యాలీ నిర్వహించారు.. వర్షం పడుతుండడంతో విద్యార్థులు తడిసి చలికి వణికిపోయారు..విద్యార్థులతో వర్షంలో ర్యాలీ చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు..మానవతా సభ్యులు మాత్రం అందరూ గొడుగులు పట్టుకుని ఉన్నారు..విద్యార్థులను వర్షంలో తడి పించడం ఏంటని వేంపల్లెలో ర్యాలీ చూసిన ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.
*టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు సిరిసిల్ల ఎంఎల్ఎ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై కెటిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరితో పాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు.
*భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రయోగం చంద్రయాన్-2 కీలక దశను విజయవంతంగా చేరుకుంది. జాబిల్లిపైకి ప్రయాణంలో భాగంగా చంద్రుడి కక్ష్యలోకి ‘మంగళ’కరంగా అడుగుపెట్టింది.
* ప్రధానంగా నోయిడా కేంద్రంగా సాగిన ఈ-బిజ్ గొలుసుకట్టు మోసం విలువ సుమారు రూ.5 వేల కోట్లకు చేరిందని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు తాజాగా గుర్తించారు.
*వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశముంది. ఈ దిశగా 15వ ఆర్థిక సంఘం పలు ప్రతిపాదనలు చేయాలని భావిస్తోంది.
*పండుగ సీజన్లో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది.
* కలుషిత నీరు, ఆహారం కారణంగా రాష్ట్రంలో ఏటా సుమారు 3.5 లక్షల మంది నీళ్ల విరేచనాల (డయేరియా) బారినపడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 13 శాతం దీనికారణంగానే చోటుచేసుకుంటున్నాయి.
*వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశముంది. ఈ దిశగా 15వ ఆర్థిక సంఘం పలు ప్రతిపాదనలు చేయాలని భావిస్తోంది.
*హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి.. కార్మికులకు వరమని, దీన్ని కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా తీర్చిదిద్దుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
*హాజరు మాసోత్సవంగా ఆగస్టు నెలను ప్రకటించి అమలు చేస్తున్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తాజాగా సెప్టెంబర్ మాసాన్ని విద్యా సామర్థ్యాల సాధన మాసోత్సవంగా ప్రకటించారు
* డాక్టర్ ఏఎస్ రావు అవార్డ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 32వ సైన్స్ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎస్టీఎస్ఈ) డిసెంబరు 1న జరగనుంది. ఈ ప్రాథమిక పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారిని డిసెంబరు 29న జరిగే తుది పరీక్షకు ఎంపిక చేస్తారు.
*వచ్చే నెల 2 నుంచి వినాయక విగ్రహాలతో ఏర్పాటుచేసే మండపాలకు విద్యుత్తు ఛార్జీలను ‘దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం) మంగళవారం ప్రకటించింది. మండపంలో మీటరు ఏర్పాటు చేసుకుంటే యూనిట్‌కు రూ.11 చొప్పున చెల్లించాలి.
*అశ్లీల వెబ్సైట్లలో ఓ మహిళ పేరును తొలగించే విషయమై గూగుల్ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటి పేరుతో ఉన్న తన పేరును తొలగించాలని కోరినా ఫలితం లేకపోవడంతో మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ప్రోగ్రామ్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్ శ్రీనివాసన్(దూరదర్శన్కేంద్రం, పుదుచ్చేరి), కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా సురేష్‌కుమార్(ఆకాశవాణి, దిల్లీ), ప్రధాన కార్యదర్శిగా కె. రష్మి(ఆకాశవాణి,దిల్లీ), తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.ఎ.కె.ఎం.హుస్సైని(ఆలిండియా రేడియో, హైదరాబాద్) ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వి.గోపీచంద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం..అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది.
*జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కృష్ణా జిల్లా నిడమనూరుకు చెందిన ప్రధానోపాధ్యాయుడు బట్టు సురేష్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి మంగళవారం ఆయనకు లేఖ అందింది. రాష్ట్రం నుంచి మొత్తం ఆరుగురు ఉపాధ్యాయుల పేర్లను పంపించగా కమిటీ సురేష్‌కుమార్‌ను ఎంపిక చేసింది.
*ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి నీటిమట్టం 10.90 అడుగులు ఉన్నట్లు జలనవరుల శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో 3,13,468 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నామన్నారు.
*ఏపీ మార్క్‌ఫెడ్, ఆగ్రోస్ ఎండీగా ఉన్న విజయరామరాజును వ్యవసాయ సహకార శాఖ నుంచి వైద్య ఆరోగ్యశాఖకు బదిలీచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఆయన్ను నియమించింది.
*ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద లెక్చరర్ల సేవలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,720 మంది లెక్చరర్లు ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పదిరోజుల విరామంతో వేతనాలు చెల్లించనున్నారు.
* జాతీయ పింఛను అదాలత్‌ను ఈ నెల 23న తిరుపతిలో నిర్వహించనున్నారు. రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఈ అదాలత్‌ను నిర్వహించనున్నామని ఖజానా శాఖ జిల్లా ఉప సంచాలకులు గంగాద్రి మంగళవారం విలేకరులకు తెలిపారు
*తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన కారు… భక్తుల కు తిప్పిన ప్రమాదం.
26 నుండి ఉదయ ఎక్స్ ప్రెస్-తాజావార్తలు–08/21
Related tags :