గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగాపిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం “గురువాయూర్”. కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు – వాయువులు కాబట్టి ఈ ఊరిని ‘గురువాయూరు’ (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. **పాతాళశిల ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి ‘త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ’నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు. **నారాయణీయం గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట. భక్తులు గురువాయురప్పని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్… అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్ పరమపవిత్ర ప్రదేశంగా మారింది. **అన్నప్రాశన గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు. **గజేంద్ర సేవ! గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు – వాయువులు కాబట్టి ఈ ఊరిని ‘గురువాయూరు’ (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని ‘గురువాయూరప్పన్’ అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో ‘అప్ప’ అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.
1. రామప్పకు యునెస్కో బృందం
రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు యూనెస్కో బృందం వచ్చేవారం రాష్ర్టానికి రానుందని పర్యాటక శాఖ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేతృత్వంలో జరిగిన ‘పర్యాటక మంత్రుల జాతీయ సమావేశానికి’ పార్థసారథి, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప తుది దశలో ఉందని చెప్పారు. యునైటెడ్నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్, కల్చరల్ఆర్గనైజేషన్(యునెస్కో) బృందం రామప్పను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే దిశలో పరిశీలన జరపనుందని వివరించారు.పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను తెలంగాణ రాష్ట్రం విరివిగా ఉపయోగించుకుంటోందన్నారు. ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజానికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని, హైదరాబాద్ లో చేపట్టిన హెరిటేజ్ టూరిజం పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. జోగులాంబ ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో చేర్చిన కేంద్రం, అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా లక్ష్యాలను రూపొందించుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోందని చెప్పారు. టూరిజం అభివృద్ధి, విస్తరణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ యోచిస్తోందని, దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన ‘టీహబ్’ సేవలను పరిశీలించాలని కోరారు.
2. ఒంటిమిట్టకు అష్ట వెండి శోభితం-పెన్నా ప్రతాప్రెడ్డి సోదరుల కానుక
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వెలసిన సీతారామలక్ష్మణమూర్తులకు ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి(పెన్నా) ప్రతాప్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రమేష్రెడ్డి సోదరులు వెండి కిరీటాలను కానుకగా సమర్పించారు. దాతల తరఫున ఇ.లక్ష్మీనరసారెడ్డి, వై.చంద్రశేఖర్, కె.రాము బుధవారం రామయ్య క్షేత్రానికి ఆభరణాలను తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా ఖాంగాన్లో ప్రత్యేకంగా వీటిని తయారుచేయించారు. వీటి బరువు 7.906 కిలోలు. శిరస్సు చక్రాలు, కర్ణపత్రాలను అందజేశారు. బంగారంతో రాజకిరీటాలను కూడా తయారు చేయిస్తున్నారు.
3. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై వ్యాజ్యం కొట్టివేత
తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్దర్శనాలను అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. వీఐపీలకు దర్శనం కలిగించడం సాధారణ భక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి రాదని స్పష్టం చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జాగర్లమూడి వెంకటసుబ్బారావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. బుధవారం వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రోజులో కేవలం రెండు గంటలు వీఐపీ, వీవీఐపీల దర్శనాలకు కేటాయించడం సాధారణ భక్తుల హక్కులను ఉల్లంఘించినట్లు కాదని తెలిపింది. సామాన్యులకు దర్శన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తితిదేను ఆదేశించింది.
4. మూడు రూపాల్లో శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల కోసం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న హరేకృష్ణ స్వర్ణ దేవాలయం ముస్తాబవుతోంది. శ్రీ రాధాగోవిందుడు, శ్రీ గోదా కృష్ణులు, వెన్న బాలకృష్ణుడుగా మూడు రూపాల్లో శ్రీకృష్ణుడు ఈ ఏడాది దర్శనం ఇవ్వనున్నారు. అలాగే శ్రీకృష్ణాష్టమి రాత్రి నూట ఎనిమిది కలశాలతో పాంచరాత్రిక మహాఅభిషేకాన్ని నిర్వహించనున్నారు. అరుదైన పుష్పాలు, హిమాలయ ఔషఽధ మూలికలు, నవరత్నాలు, ఫల రసాలతో ఈ అభిషేకం ఉంటుంది. ఈనెల 23 నుంచి 25 వరకూ- మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక పూజలతో పాటు భజనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. హరేకృష్ణ మూవ్మెంట్, అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ నేతృత్వంలో వీటిని నిర్వహిస్తున్నారు.
**ప్రధాన కార్యక్రమాలు:
ఆగస్టు 23: ఉదయం ఆరున్నర గంటలకు కీర్తనలతో శ్రీకృష్ణ జన్మాష్టమి
వేడుకలు ప్రారంభం అవుతాయి.
ఆగస్టు 24: ఉదయం పది గంటలకు పిల్లలకు చిన్ని కృష్ణుడి వేషధారణ పోటీలు ఉంటాయి. రాత్రి తొమ్మిది గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి అర్థరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం శ్రీ రాధా గోవింద అభిషేకం, యాభైఆరు రకాల విశేష నైవేద్యాల నివేదనరాత్రి పన్నెండు గంటలకు మహా మంగళహారతి ఉంటాయి.
ఆగస్టు 25: సాయంత్రం రాత్రి ఏడు గంటలకు శ్రీల ప్రభుపాద అభిషేకం, అనంతరం గురుపూజ తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.
5. అష్టమి వేడుకలకు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకులకు ధార్మిక పట్టణం ఉడుపి సిద్ధమైంది. ఈ నెల 23, 24లలో వేడుకలు నిర్వహిస్తారు. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల నుంచి పులి వేషాల కళాకారులు, చిరు వ్యాపారులు అప్పుడే పట్టణానికి చేరుకున్నారు. రథ వీధిలో వ్యాపారుల సందడి ఆరంభమైంది. 23న అర్ధరాత్రి మట్టితో తయారు చేసిన కృష్ణుడి విగ్రహానికి అర్ఘ్య ప్రదానం ఉంటుంది. మరుసటి రోజున రథ వీధిలో ఉట్టికొట్టే పోటీలు నిర్వహిస్తారు. అర్ఘ్యాన్ని ప్రదానం చేసే సమయంలో ఆలయ ప్రాంగణంలో భజనలు, హరికథా కాలక్షేపాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. స్వామికి నైవేద్యాల్ని సమర్పించేందుకు చక్కిలాలు, పేలపిండి, చలిమిడి ఉండలు, ఇతర వంటకాల్ని అష్టమఠాధిపతుల ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. రథోత్సవం సందర్భంగా భక్తులకు వీటిని పంపిణీ చేస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు తొక్కిసలాటకు అవకాశం లేకుండా వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పర్యాయ పలిమారు మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లోని విద్యార్థులకు వీటిని ప్రసాదాలుగా పంపిణీ చేస్తారు.
6. ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’కు ఏర్పాట్లు పూర్తి
టిటిడికి చెందిన ిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలలో ఆగస్టు 23న శుక్రవారం జరుగనున్న గోకులాష్టమి గోపూజ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపూజ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6 నుండి 9 గంటల వరకు వేణుగానం, ఉదయం 7.30 నుండి 8.30 గంటలకు ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి 10.00 గంటల వరకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటం, ఉదయం 8 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమాలు చేపడతారు. దయం 10.15 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ ఘనంగా జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు. సాంస్క తిక కార్యక్రమాల అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపిస్తారు. ఈ సందర్భంగా పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించింది.
7.సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు జమ్మలమడుగు
శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు టిటిడి పరిధిలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 7న సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారుెప్టెంబరు 8వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చతుష్ఠార్చాన, పుణ్యాహవచనం, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 9.00 నుండి 1.00 గంటల వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 10న ఉదయం 6.00 నుండి 1.00 గంటల వరకు మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం, పవిత్ర వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
8.టిటిడి స్థానిక ఆలయాలలో ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాలలో ఆగస్టు 23వ తేదీ శుక్రవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆగష్టు 24వ తేదీ ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
**తిరుచానూరులోని శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.గోకులాష్టమి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కృష్ణ స్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.00 గంట వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా ఆగస్టు 24న శనివారం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగనుంది.తిరుపతిలోని కపిలితీర్ధం వద్ద వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలోతిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోనారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 నుండి 6.45 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు. ఆగష్టు 24వ తేదీ శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం చేయనున్నారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలోనాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు. ఆగష్టు 24వ తేదీ శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం చేయనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
9.కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు, ఉత్ససర్లకు తిరుమంజనం చేయనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమల, కొలువు, పంచాంగ శ్రవణం, నిర్వహించనున్నారు. సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు గో పూజ మహోత్సవం, ఉట్లోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
10. శుభమస్తు
తేది : 22, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి :షష్టి
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 31 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 5 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 46 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 34 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 48 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 9 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 7 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 5 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మేషము
11. చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 22*మద్రాసు దినోత్సవం
1860: నిప్కోడిస్క్ ను కనుగొన్న పాల్ గోటిలిబ్ నిప్కో జననం.
1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
1869: హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితుడైన మొదటి హిందువు పింగళి వెంకట రామారెడ్డి జననం (మ.1953).
1922: అల్లూరి సీతారామరాజు ద్వారా మన్యం విప్లవం ప్రారంభించబడినది.
1924: ప్రముఖ హిందీ కవి హరిశంకర్ పరసాయి జననం.(మ.1995)
1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
1933: భారతీయ నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం (మ.1994).
1955: తెలుగు సినిమా కథానాయకుడు, కాంగ్రెసు పార్టీ నాయకుడు మరియు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి జననం.
1964: ప్రముఖ రంగస్థల నటీమణి రేకందార్ గుణవతి జననం.
2014: ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి మరణం (జ.1932).
12. తిరుమల \|/ సమాచారం* *
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు గురువారం,
*22.08.2019*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *21C° – 26℃°*_
• నిన్న *73,256* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని *10*
గదులలో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*06* గంటలు పట్టవచ్చును
• నిన్న *36,778* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.88* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ:10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
కౌసల్యా సుప్రజా రా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
*తాకౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నద
కావున లెమ్ము స్వామి
13. అత్తివరదర్ ఉత్సవాల సందర్భంగా కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌కు హుండీ ద్వారా రూ.9.90 కోట్ల కానుకలు వచ్చాయి. గత నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 17తో ముగిశాయి. స్వామికి భక్తులు చెల్లించే కానుకల కోసం ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 హుండీలను ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని లెక్కించగా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్టు కలెక్టర్ పొన్నయ్య తెలిపారు. ఇప్పటి వరకు 13 హుండీలను మాత్రమే లెక్కించామని, త్వరలోనే మిగతా హుండీలను కూడా లెక్కిస్తామని కలెక్టర్ తెలిపారు.
14. దుర్గగుడి ఈవోగా సురేష్‌బాబు
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ బదిలీ అయ్యారు. నూతన ఈవోగా ఎం.వి.సురేష్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఎం.వి.సురేష్‌బాబు అన్నవరం ఆలయం నుంచి ఇక్కడికి బదిలీపై ఈవోగా వస్తున్నారు.
15. TTD and books:
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారు ఒక మంచి పని చేశారు. వారి మొత్తం ప్రచురించిన అన్ని పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) ప్రతులు గా మార్చి ఉచితంగా చదువు కోవడానికి వీలుగా INTER NET అందు బాటు లోకి తెచ్చారు .వాటిని ఉచితంగా DOWNLOAD కూడా చేసుకోవచ్చు . మహా భారతం , పోతన భాగవతము, అన్నమయ్య సంకీర్తనలు ,త్యాగరాజ కీర్తనలు, వంటి ఎన్నోఅరుదయిన మంచి రచనలు , పుస్తకాలు మనకు ఇప్పటికయినా అందు బాటు లోకి తేవడం ఒక ప్రయోజనం . సప్తగిరి సచిత్ర మాసపత్రిక కూడా అన్ని భాషల్లో ఉచితం గా చదువు కోవచ్చు .Link click here: ebooks.tirumala.org
కృష్ణాష్టమి ప్రత్యేకం…గురువాయుర్ దేవాలయం
Related tags :