* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి.
* తిరుమలలో మినరల్ వాటర్ అమ్మకాన్ని నిషేధించనున్న టీటీడీ. టీటీడీనే స్వయంగా ఎక్కడికక్కడ భక్తులకు శుద్ధి చేసిన నీటిని అందించనున్నది..
* ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో నుంచి రోడ్డును దాటుతూ ఓ ట్రాక్టర్ నీటిలో మునిగిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
* మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అపరాధిగా ఉన్న నళిని పెరోల్‌ను మరో మూడు వారాలు పొడిస్తున్నట్లు మద్రాస్ట్ హైకోర్టు గురువారం తెలిపింది. ఆగస్ట్ 25వ తేదీతో పెరోల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం నళినికి కాస్త ఊరట కలిగించే అంశం.
* పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాయ్‌వాలీగా అవతారమెత్తారు. దిఘా జిల్లాలోని దుత్తపూర్ గ్రామంలో నిన్న మమత పర్యటించారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ చాయ్ దుకాణంలోకి వెళ్లిన మమత.. చాయ్ చేశారు.
అనంతరం స్థానికులకు చాయ్ తన చేతులతో అందించారు. జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని ఆమె అన్నారు.
* అన్నవరం దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్ లో టెండర్ డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు రూ 5000వేలు లంచం తీసుకుంటూ….ఎ.సి.పి అధికారులకు పట్పుబడ్డా గుమస్తా చిక్కల సాయి బాబా ….టెండర్ దారుడు గాదె వరప్రసాద్ పిర్యాదుతో….కేసు నమోదు చేసిన ఎ.సి.పి డిఎస్పీ రామచ్రరావు.
* ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిబిఐ కార్యాలయంలోని మొదటి అంతస్తులో చిదంబరాన్ని అధికారులు విచారిస్తున్నారు.
* సిరిసిల్ల బతుకమ్మ చీరకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో చేనేత జౌళిశాఖ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో బతుకమ్మ చీరల తయారీ పనులపై ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
* భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు కేంద్రం ఇటీవల ఆయనకు వీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. సరిహద్దులకు అవతల పాకిస్తాన్ కు పట్టుబడి, ఆపై అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగా తిరిగి వచ్చిన అభినందన్ మళ్లీ యుద్ధ విమానాన్ని ఎక్కాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాక్ ఫైటర్ జెట్స్ తో జరిగిన యుద్ధంలో వర్ధమాన్ నడుపుతున్న MIG 21 కూలిపోయింది.
*గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా సెప్టెంబరు ఐదున అంతర్జతేయ ఎయిర్ లైన్స్ సదస్సును నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి దేశీయ అంతర్జాతీయ అనుసందానత పెంచడంలో భాగంగా తొలిసారి ఇక్కడ సదస్సును ఏర్పాటు చేశారు. కేంద్ర పౌర విమానాయాన శాఖ భారత విమానయాన సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదసును నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
*భారత్ లో బడి పిల్లలకు మద్యాహ్న భోఝానం అందజేస్తున్న అక్షయపాత్ర పౌండేషన్ కు అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పరత నర్స్ సంస్థ పది లక్షల అమెరికన్ డాలర్లు విరాళాన్ని ప్రకటించింది. భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విస్టా సంబందిత భాగస్వామ్య సంస్థల తరపున అక్షయ పాత్ర పౌండేషన్ కు ఈ మొతాన్ని అందించనున్నారు.
*ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వరదనీరు చేరి యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.ఢిల్లీలోని లోహాపూల్ వద్ద ఉన్న ఓల్డ్ యమునా బ్రిడ్జి వద్ద నీటిమట్టం 204. 95 మీటర్లకు చేరింది. వంతెన వద్ద ప్రమాదకర స్థాయికి వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యమున నదీ తీరంలోని లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదబాధితులకు సహాయ శిబిరాలకు తరలించి వారిని ఆదుకోవాలని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు…
*కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సిబిఐ అధికారులు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. రాత్రంతా సిబిఐ హెడ్ క్వార్టర్ట్స్‌లోనే చిదంబరం ఉన్నారు. సిబిఐ అధికారులు రాత్రంతా చిదంబరాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు
*నాలుగు రాష్ట్రాలకు ఢిల్లీలోని కేంద్రవాతావరణశాఖ ‘పిడుగు’లాంటి హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని కేంద్ర వాతావరణశాఖ అధికారులు గురువారం ఉదయం హెచ్చరించారు. దీంతోపాటు ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని అధికారులు హెచ్చరించారు.
*హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్గా జోయెల్ రిఫ్మాన్ బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్లోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. మంగళవారం రిఫ్మాన్ బాధ్యతలు స్వీకరించినట్లు బుధవారం కాన్సులేట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
*ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తానుకానీ, తన కుటుంబ సభ్యులుకానీ ఎలాంటి తప్పూ చేయలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పష్టంచేశారు. ముందస్తు బెయిల్కోసం ఆయన దాఖలుచేసిన కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సహచరులైన న్యాయవాదులు కపిల్సిబల్, అభిషేక్సింఘ్వీ, మల్లికార్జున ఖర్గేలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
*ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముసురుకుంటున్న నేపథ్యంలో ఈ-కామర్స్పై దాని ప్రభావం స్వల్పమేనని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. భారత్లోని రిటైల్ వ్యాపారంలో కేవలం 3 శాతమే ఈ-కామర్స్ వాటా ఉందని, ఇది చాలా స్వల్పమేనని అన్నారు.
*బీమా లేని అసంఘటిత రంగ కార్మికులకు సైతం ఇకనుంచి ఈఎస్ఐ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ వెల్లడించారు.
*రఫేల్ యుద్ధవిమానాల రాకకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే భారత్ అమ్ముల పొదిలో చేరనున్నాయి. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, ఎయిర్చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వచ్చే నెలలో ఫ్రాన్స్ రాజధాని పారిస్కు వెళ్లి తొలి విమానాన్ని స్వీకరించనున్నారు.
*భారత్, పాక్ల మధ్య వైమానిక పోరాటంలో సంచలనానికి కేంద్రబిందువైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి మిగ్ 21 యుద్ధవిమానాన్ని నడిపారు. ఫిబ్రవరి 27న జరిగిన భారత్, పాక్ గగనతల పోరులో పాక్కు చెందిన ఎఫ్-16 జెట్ను నేలకూల్చి, తన యుద్ధవిమానం దాడికి గురవడంతో కిందికి దూకి, పాక్ చేతికి చిక్కి విడుదలైన అభినందన్ సుమారు ఆరు నెలల తర్వాత కాక్పిట్ ఎక్కారు.
* విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో ప్రవేశించిన చంద్రయాన్-2.. మరో దశను దాటింది. చంద్రుడి చుట్టూ 114 X 18,072 కి.మీ. కక్ష్యలో మంగళవారం అడుగుపెట్టిన చంద్రయాన్-2 బుధవారం మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో రెండోసారి కక్ష్యను 118 X 4,412 కి.మీ.కు తగ్గించుకుంది.
*దేశం గర్వించదగ్గ వస్త్రోత్పత్తులకు నిలయమైన తిరుపూర్ స్థాయికి సిరిసిల్ల వస్త్రోత్పత్తులు చేరుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు.
*విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్రాయ్, రాధికారాయ్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2007-09 మధ్య సదరు ఉల్లంఘన జరిగినట్లు పేర్కొంది.
*భవిష్యనిధి ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన కరవైందని ఈపీఎఫ్ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నేతలు పేర్కొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ బుధవారం హైదరాబాద్ బర్కత్పురలోని ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో ఉద్యోగులు నినాదాలు చేసి నిరసన తెలిపారు.
*ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పూర్తిగా తెలుగులో పొందవచ్చు. దీనికి అనుగుణంగా సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలు రాష్ట్రమంతటా విస్తరించేలా ఉమ్మడి కృషి జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం..ప్రముఖ సంస్థ గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది.
*దేశంలో 2021 జనాభా లెక్కల రిజిస్టర్ తయారీ కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన జరగనుంది. అసోం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సెప్టెంబరు 30 వరకు సాగుతుంది.
* టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. కార్మికులకు కొత్తగా వేతన సవరణ చేసి, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది.
*దేశంలో 2021 జనాభా లెక్కల రిజిస్టర్ తయారీ కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన జరగనుంది. అసోం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సెప్టెంబరు 30 వరకు సాగుతుంది.
*మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ) విద్యుదుత్పత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు 91.74 శాతం (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) ఫీఎల్ఎఫ్ను సాధించి దేశంలోనే అయిదో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
*ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
* రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా జి.మనోహర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు.
*గోదావరి నీటిని కృష్ణాబేసిన్కు మళ్లించడంపై రెండు రాష్ట్రాల ఇంజినీర్ల మధ్య గురువారం జరగాల్సిన సమావేశం వాయిదాపడింది.
* గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా సెప్టెంబరు 5న అంతర్జాతీయ ఎయిర్లైన్స్ సదస్సును నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి దేశీయ, అంతర్జాతీయ అనుసంధానత పెంచడంలో భాగంగా తొలిసారి ఇక్కడ సదస్సును ఏర్పాటు చేశారు.
*జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్‌డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు
*సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐను కేంద్ర ప్రభుత్వం ”వ్యక్తిగత ప్రతీకారేఛ్చ విభాగం”గా ఉపయోగించుకుంటున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరాన్ని సిబిఐ అరెస్టు చేసిన ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ”కేసును 9 సంవత్సరాల తరువాత నమోదు చేశారు. 11 సంవత్సరాల తరువాత ఆయనను అరెస్టు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత ప్రతీకారేచ్ఛ విభాగంగా ఉపయోగించుకుంటున్న సిబిఐ చేసిన పని” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు.
జగన్ సర్కార్ మరో సంచలనం-తాజావార్తలు–08/22
Related tags :