* ప్రముఖ భారత నటి ప్రియాంకా చోప్రాను ‘శాంతిదూత (పీస్ అంబాసిడర్) హోదా’ నుంచి తొలగించాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస)ని పాకిస్థాన్ కోరింది. కశ్మీర్‌కు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వంతపాడటంతో పాటు… భారత్-పాకిస్థాన్‌ల నడుమ అణు యుద్ధం జరగాలని ఆమె ఆకాంక్షిస్తున్నారని ఆరోపించింది. అణ్వాయుధాలను ముందుగా ప్రయోగించకూడదని భారత్ నియమం పెట్టుకున్నా… పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం మారవచ్చంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను చోప్రా స్వాగతించారని ప్రస్తావించింది. శాంతి దూత పాటించాల్సిన కనీస నియమాలకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నందున… ఆ పదవి నుంచి ఆమెను తొలగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిటా హెచ్ ఫోర్‌కు పాకిస్థాన్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి ఇటీవల లేఖ రాశారు.
* మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఈ నెల 16 నాటి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. బీమా డబ్బుల కోసం కన్నకొడుకే తండ్రికి కరెంట్ షాకిచ్చి చంపేశాడని విచారణలో తేల్చారు. మండలంలోని తిప్పనగుల్లకు చెందిన గుర్రాల చంద్రం (42) కొడుకు దయాకర్ (20) పని చేసుకోకుండా తిరుగుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో కొడుకు కక్ష పెంచుకున్నాడు. బీమా డబ్బులు, ట్రాక్టర్ రుణమాపీ, వెహికల్ ఇన్సూరెన్సులు కూడా వస్తాయని తండ్రిని చంపాలనుకున్నాడు. ఊళ్లోని కిరాణా షాపులో ఇనుప బైండింగ్ వైర్ కొని వాళ్ల పొలంలో బోరు మోటారు స్టాటర్ ఫ్యూజ్‌కు షాక్ కొట్టేలా కనెక్షన్ ఇచ్చాడు. రోజూలాగే బోరు మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్లిన చంద్రం షాక్ తగిలి మరణించాడు. తొలుత ప్రమాదవశాత్తు మరణమేనని పోలీసులు అనుకున్నారు. కానీ అనుమానం రావడంతో దయాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అతన్ని అరెస్టు చేసి బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
* ఉత్తరకాశీలోని మోరీలో కరెంటు వైర్లు తగిలి రెస్క్యూ హెలికాప్టర్ బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, స్థానికుడు ఒకరు చనిపోయారు.
* గజపతినగరం మండలం గుడివాడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. లారీలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
* కాకుళం జిల్లాపాలకొండ మార్కెట్ లో తప్పిన పెను ప్రమాదంమార్కెట్ లో లారీ విద్యత్ స్ధంభంను డీ కొనడంతో స్ధంభం విరిగి జారి పోయినదిఆ సమయంలో అటు వైపుగా ప్రజలు ఎవరూ మార్కెట్ లోకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినది
* నాగాయలంక మండలం పరిధిలోని గుల్లలమోదలో నిర్మించబోయే క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఈ నెల 26వ తేదీన కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేయబోతున్నారని మెరైన్ సిఐ వల్లభనేని పవన్‌కిషోర్ తెలిపారు.
* విజయవాడ నగరంలోని సత్యనారాయణ పురంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. శ్రీనగర్‌కాలనీలో ఇంటిముందు నిలిపి ఉంచిన రెండు ద్విచక్రవాహనాలు, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
* విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి మరో లారీ ఢీకొనడంతో మంటలు వ్యాపించి డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
* బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం కళ్యాణదుర్గం రోడ్డులోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
* కోహినూర్ మిల్లు భూమి కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) రాజ్ ఠాక్రే గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు.
* అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి అలసి పోయినట్టున్నాడు. హాయిగా బెడ్ ఎక్కేశాడు. కునుకు పడుతున్న సమయంలో ఎదో మెత్తగా తగులుతున్నట్టనిపించింది. పరుపే అనుకున్నాడు కానీ.. పామని ఎలా ఊహించగలడు. అది కదులుతుండేసరికి అప్పుడు కానీ అనుమానం రాలేదు. పామని తెలిసే సరికి పరుగో పరుగు. పాములు జనావాసాల మధ్యలో కనిపించడం పరిపాటై పోయింది ఈ మధ్య కాలంలో. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లోని బెడ్రూమ్‌లోకి దూరి బెడ్‌పై రెస్ట్ తీసుకుంటోంది ఓ పొడవాటి కొండ చిలువ.
* ఆటో కెపాసిటీ నలుగురైతే ఎనిమిది మందిని ఎక్కించుకోవడం.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా మరో రూట్‌లో వెళ్లిపోవడం.. పుల్లుగా మందుకొట్టి రయ్యిమంటూ బండి మీద దూసుకు పోవడం.. ఇవన్నీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసు. అయినా నిర్లక్ష్యం. నలుగురికి ఎనిమిది మంది ఎక్కితే నాలుగు డబ్బులు వస్తాయేమో కాని నిండు ప్రాణాలు బలైతే ఆ కుటుంబాలకు తీరని వేదన మిగులుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రవాణా నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుంచి రానున్న మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కఠినంగా వ్యవహరించనుంది.
*ప్రతిష్టాత్మక రాష్ట్రపతి సేవా అవార్డుకు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఎంపికైంది. జాతీయ సేవా పధకం కార్యక్రమాల నిర్వహణలో కళాశాల మేటిగా నిలవడంతో 2017-18 విద్యా సంవత్సరానికి పురస్కారం వరించింది.
*విదేశీ ప్రత్యక్ష పెటుబడుల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోఅపణలు పై ఎన్డీటీవీ ప్రమోటార్లు ప్రణయి రాయ్ రాధికా రాయ్ తదితరుల పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2007-09 మధ్య సదరు ఉల్లంఘన జరిగినట్లు పేర్కొంది. కంపెనీ సిఈవో విక్రమాదిత్య చంద్ర, మరో ప్రభుత్వ అధికరిపైనా బుధవారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
*పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు చోరీ జరిగింది. మీ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాలేదంటూ మాయమాటలు చెప్పి విజయలక్ష్మి అనే మహిళ అకౌంట్ నుంచి రూ.లక్ష అపహరించారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అకౌంట్ నుంచి రూ.2,200 చోరీ చేశారు.
*వీఐపీలకు పార్శిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కేసీఆర్, కేటీఆర్, డీజీపీ వంటి ప్రముఖులకు పార్శిల్స్‌లో మురుగునీరు పంపిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
*భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను, అతడి అనుచరులను ఢిల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లిలోని సంత్ రవిదాస్ ఆలయాన్ని కూల్చివేసిన ఘటనకు నిరసనగా భీమ్ ఆర్మీ చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకం కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రవిదాస్ ఆలయం కూల్చివేతకు నిరసనగా ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో కొంతమంది పోలీసులతో ఘర్షణ పడ్డారని, కొందరు పోలీసులకు గాయాలయ్యాయని ఆగ్నేయ ఢిల్లి డిసిపి చిన్మయ్ బిస్వాల్ చెప్పారు. భీమ్ ఆర్మీ
చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో సహా పలువురిని అరెస్టు చేశామని ఆయన అన్నారు.
*హైదరాబాద్ మీర్ పెట్ లో దారుణం.నందనవనంలో ఆడపిల్ల పుట్టిందని చంపి కవర్లో కట్టి కింద పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
*కెందుజహర్ జిల్లా ఘటాగాన్ వద్ద గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న రెండు ఏనుగులను లారీ ఢీకొంది. దీంతో ఆ రెండు ఏనుగులు మృతి చెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. శవ పరీక్ష కోసం మృతి చెందిన ఏనుగులను వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు…
*దుబాయ్‌లోని ఎతిసలాత్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ యువకుడు అబ్దుల్ వహాబ్ అదృశ్యమయ్యాడు. గత ఎనిమిది నెలలుగా తమ కుమారుడి ఆచూకీ తెలియరావడం లేదంటూ ఆయన తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఘనీ కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమారుడి ఆచూకీ చెప్పాల్సిందిగా విదేశీ మంత్రిత్వ శాఖ సాయాన్ని అర్థించాడు.
*విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మదుపాడలో దారుణం గ్రామం నడిబొడ్డులో వ్యక్తిని కిరాతకంగా నరికి చంపిన ఘటన ఆందోళనలో గ్రామస్తులు మృతుడు సున్నపు ఎర్రినాయుడుగా గుర్తించిన స్థానికులు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు
*రంగంపేట లో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీ కొట్టడంతో మహిళా కానిస్టేబుల్ మృతి..పిఠాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోన్న మహిళా కానిస్టేబుల్.. పిఠాపురం నుంచి రాజమండ్రి కోర్టుకు వెళ్తుండగా రంగంపేటలో చోటు చేసుకున్న ప్రమాదం..
*సూర్యపేట జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడ్లబండిని ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మారుమూల వలస ఆదివాసీ గ్రామమైన బుడుగులలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది.
*నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని సార్లపల్లి గ్రామానికి చెందిన చిగుర్ల చంద్రయ్య అనే వ్యక్తి తన నాలుక కోసి భార్య చేతిలో పెట్టిన సంఘటన చోటుచేసుకుంది.
*ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముక్క సుదర్శన్(70), ముక్క ప్రమీల(65) బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
*కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మంటి రామయ్య, ప్రకాశమ్మ దంపతులు కుమార్తె కల్యాణిని చందర్లపాడు మండలం కొడవటికల్లుకు చెందిన తోట నాగరాజుతో సోమవారం రాత్రి వివాహం జరిపించారు.
* పొలం పనులకు వెళ్దామనుకున్న ఒకరిని, కాసేపట్లో బడికి వెళ్లబోతున్న బాలికను పిచ్చికుక్క గాయపరిచింది. ఘటన తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
*రద్దుచేసిన పాత నోట్లు మార్చేందుకు యత్నించిన 13 మంది నిందితులను విశాఖ నగర పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ.కోటి విలువైన నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో మోరీ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఒక హెలికాప్టర్ బుధవారం కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్ పైలట్, కోపైలట్ సహా అందులో ప్రయాణిస్తున్న మరో స్థానికుడు అక్కడికక్కడే మృతి చెందారు.
*ఉత్తర్ప్రదేశ్లో ఇటావాలోని సైఫై వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో కొత్త విద్యార్థులను అవమానించారు. వారికి గుండు గీయించారు.
*నాలుక తెగిన స్థితిలో వైద్యశాలకొచ్చిన ఈ యువకుడి పేరు చిగుర్ల చంద్రయ్య. ఊరు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లి. భార్య లింగమ్మతో మంగళవారం గొడవపడి, ఆ రాత్రంతా ఆగ్రహంతో రగిలిపోయి, బుధవారం ఉదయం కత్తితో నాలుక కోసేసుకున్నాడు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో బుధవారం ఉదయం మావోయిస్టులతో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
* భార్య గొంతు నులిమి చంపి దాన్నో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో భర్త. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది.
*విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి మరో లారీ ఢీకొనడంతో మంటలు వ్యాపించి డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. అయితే ఆగి ఉన్న లారీ కూడా అంతకుముందే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రాపై పాక్ ఫిర్యాదు-నేరవార్తలు–08/22
Related tags :