Editorials

సోడా వెనుక కథ ఇది

The history of goli soda from india

జర్మనీలో పుట్టి, లండన్‌లో పెరిగి, భారతదేశంలో 70 ఏళ్ల క్రితం అడుగుపెట్టిన గోలీసోడాకు 120 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మశక్యం కాదు.తొలినాళ్లలో (కాణి) పైసాన్నర ధర ఉండే గోలీసోడా నేడు అయిదు నుండి పది రూపాయలు పలుకుతోంది. ఇప్పటికీ కొందరు కడుపు ఉబ్బరంగా ఉంటే ముందుగా సోడా తాగుతారు.అప్పట్లో జర్మనీలో తయారైన సోడా సీసాలు మన దేశానికి దిగుమతయ్యేవి. ఇప్పుడు మన దేశంలోనే సీసాలను తయారు చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని కంపెనీలు ఈ గోలిసోడా ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. సోడాగ్యాస్‌లో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌ గ్యాస్‌ సిలిండర్లను ఉయ్యూరు చక్కెర కర్మాగారం, విశాఖపట్నంలోని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేసేవి.
వాటర్‌ ప్యాకెట్లు వచ్చిన తరువాత పట్టణాల్లో కనుమరుగవుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సీజన్‌లో సోడా వ్యాపారం సాగుతోంది. ప్రతీ కిళ్లీ దుకాణాల్లోనూ ఇవి లభించేవి.అలాగే వీధుల్లో సోడాలను బళ్లపై వేసుకుని సాయంత్రం పూట అమ్ముకుని జీవనోపాధి పొందేవారు.
వేసవి తాపాన్ని తీర్చే ఐస్ సోడా
నోరూరించే నిమ్మ సోడా
సువాసనల సుగంధి సోడా
ఆనందించే ఆరంజి సోడా
పులకింపచేసే పన్నీరు సోడా
రసభరితమయిన రస్నా సోడా
రోజూ తాగితే ఏదో ఒక సోడా
మనసవుతుంది ఠండా ఠండా
కోరుతూనే ఉంటారు థోడా థోడా