కప్పు నీటిని మరిగించి, పొయ్యి కట్టేయాలి. అందులో శుభ్రం చేసిన 12 తులసి ఆకులను వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తరువాత వేడివేడిగా ఆకులతో సహా తాగాలి. ఇది కఫదోషాన్ని, దగ్గునీ తగ్గిస్తుంది. వైరల్ జ్వరాల నుంచి రక్షణ అందిస్తుంది. తాజా తులసి ఆకులు అందుబాటులో లేకపోతే ఒకేసారి ఈ ఆకులను తెచ్చుకుని ఎండబెట్టి భద్రపరుచుకోవచ్చు. వీటితో టీ తయారు చేసేటప్పుడు మాత్రం నీటిలో కనీసం నిమిషంపాటు మరగనివ్వాలి. అప్పుడే ఆకుల్లోని సారం నీటిలోకి దిగుతుంది.
తులసి తేనీరు తాగారా?
Related tags :