కాకినాడలో పెద్దమార్కెట్ లో సాయిబాబా గుడి ఎదురుగా పెసరట్టు కొట్టు లో పొద్దుట 8 నుండి రాత్రి 11 వరకు..సుబ్బారావు గారు వరలక్ష్మి గారు 35 సంవత్సరాలు నుండి వేస్తున్న పెసరట్టు, ఉప్మా చాలా ఫేమస్
వేడి వేడి పెసరట్లు మూడు వేసి గరిటతో ఉప్మా వేసి పక్కన కారప్పొడి చల్లి విస్తరాకు లో పెట్టి వేడిగా అందిస్తుంటే కమ్మటి ఆ పెసరట్టు ఎంత రుచిగా ఉంటుందని…
అబ్బాబ్బా చెప్పడం తరమా…
తినడమే తరువాయి
ఇంతకీ మూడు పెసరట్లు,ఉప్మా,కారప్పొడి కలిపి 15 రూపాయలు మాత్రమే..
మొన్న కాకినాడలో ఎవరో చెపితే వెళ్ళాము…
అదిరింది అంతే రుచి…
మీరు కూడా వెళ్లి రుచి చూడండి మరి..
అన్నట్లు చెప్పడం మరచిపోయా…
అక్కడ మినపట్టు కూడా దొరుకుతుంది మరి కమ్మగా..
కాకినాడ కాజాకే కాదు…పెసరట్టుకు ఫేమసే…
Related tags :