దేశంలో గతంతో పోలిస్తే వృద్ధి రేటు తగ్గినప్పటికీ ఆర్థిక మాంద్యం వచ్చేసిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ హర్షా ఉపాధ్యాయ పేర్కొన్నారు. గతంలో 7-8శాతం వృద్ధిని చూశామని ఇప్పుడు 5-6శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. మార్కెట్‌లో ఏది గరిష్ఠం-కనిష్ఠమని ఎవరూ చెప్పలేరన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల పనితీరు కూడా ఆశించినంత గొప్పగా లేదు. అంతర్జాతీయంగా మాంద్యం వచ్చినప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. దీనివల్ల మన దేశానికి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. ధరలు తగ్గడం, ముఖ్యంగా ముడి చమురు ధర దిగివస్తే దిగుమతుల భారమూ తగ్గుతుందన్నారు. రానున్న పండగల సమయంలో వినియోగదారుల కొనుగోళ్లు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మాంద్యం భారతదేశానికి మంచిదని మహీంద్ర మాట
Related tags :