Devotional

కృష్ణాష్టమి ప్రత్యేకత

Special Focus On Sri Krishnashtami

2. తిరుమల బ్రహ్మోత్సవాల్లో దాతలు-స్వయంగా వస్తేనే గదుల కేటాయింపు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో దాతలు స్వయంగా వస్తేనే వసతి గదులు కేటాయించనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమలలో విశ్రాంతి భవనాలు నిర్మించిన దాతలు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8వ తేదీ లోపు గదులు అవసరమైన పక్షంలో cdms.ttdsevaonline.com తితిదే వెబ్సైట్ ద్వారా రిజర్వు చేసుకోవాలని సూచించింది. అక్టోబరు 4న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా అక్టోబరు 2 నుంచి 4 వరకు దాతలకు కూడా గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. మొత్తం ఉత్సవాల్లో గరిష్ఠంగా రెండు రోజుల పాటు మాత్రమే గదులను వినియోగించుకోవాలని సూచించింది.
3. తిరుమల బస్సు టికెట్లపై అన్య మత ప్రచార ముద్రణ
తిరుమల-తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక హిందూయేతర మతానికి సంబంధించిన ప్రకటనలు ముద్రితమై ఉండటం వివాదానికి దారి తీసింది. ప్రయాణికులకు టిమ్ ద్వారా ఇచ్చే టికెట్ల రోల్స్ వెనుక భాగంలో ఎలాంటి ప్రకటనలూ ఉండరాదన్నది నిబంధన. దీనికి విరుద్ధంగా హిందూయేతర మతానికి సంబంధించిన యాత్ర వివరాలను ముద్రించిన టికెట్లను గురువారం తిరుమలలో ప్రయాణికులకు ఇచ్చారు. దీన్ని గమనించిన యాత్రికులు… ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రకటనలు లేని టికెట్లను ఇచ్చారు. ఈ ఘటనపై తిరుమల డిపో మేనేజర్ గిరిధర్రెడ్డి స్పందిస్తూ.. ‘రోల్స్పై అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రకటన గురించి తెలియక సిబ్బంది మిషన్లలో అమర్చారు. దీనిపై విచారణ చేపట్టాం’ అని వివరించారు.
4. శుభమస్తు
తేది : 23, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న ఉదయం 7 గం॥ 6 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 7 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 35 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 46 ని॥ వరకు)
యోగము : ధ్రువము
రణం : బవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 50 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ఈరోజు
అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 1 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 37 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మేషము
5. చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 23
634 : మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు అబూబక్ర్ మరణం.
1872 : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జననం (మ.1957).
1890 : తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి మరణం.(జ.1803)
1900 : ప్రముఖ కవి,పండితుడు మరియు గ్రంథ రచయిత మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ జననం.( మ.1974)
1918 : భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి జననం.(మ.2001)
1932 : తెలుగు రచయిత మరియు కవి ఉండేల మాలకొండ రెడ్డి జననం.
1953 : ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత అట్టాడ అప్పల్నాయుడు జననం.
1966 : చంద్రుని కక్ష్య నుండి భూమి యొక్క చిత్రాన్ని లూనార్ ఆర్బిటర్ 1 తీసింది.
1971 : అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన షామూ మరణం.
1994 : ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ ఆరతి సాహా మరణం.(జ.1940)
6. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
23.08.2019 వతేది, శుక్రవారము ఆలయ సమాచారం
శ్రీస్వామి వారి దర్శన వేళలుఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండునుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు… శుక్రవారము సందర్భముగా అమృతవళ్ళి అమ్మవారు (మహాలక్ష్మీదేవికి) ప్రత్యేక అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో కార్యకమమును ఉదయము 7.30 గంటల నుండి ప్రారంభమగునుస్వామి వారి దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 గంటలకు వుండునుశ్రావణ శుక్రవారము ఉదయము 10.00 గంటల నుండి దేవస్థానము నందు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాల కార్యక్రమమును దేవస్థానము వారి అధ్వర్యములో అలయ ఆర్చకులచే శాస్త్రోక్తంగా వ్రత పూజ కార్యక్రమము నిర్వహించబడను రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ 1.00 నుండి 2.00 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
**ఆర్జిత సేవాల వివరములు
23.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 32
23.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 8
7. తిరుమల \|/ సమాచారం *ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు శుక్రవారం,
23.08.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 22C° – 28℃°
• నిన్న 74,438 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 22
గదులలో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
12 గంటలు పట్టవచ్చును
• నిన్న 34,584 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.43 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ:10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి