ఊహించిందే జరిగింది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు పడింది. వరల్డ్ కప్ సెమీస్‌లో ఇండియా ఓటమి.. ఆటగాళ్ల బ్యాటింగ్ పొజిషన్లపై విమర్శలు రావడంతో బంగర్‌ను తప్పించిన నేషనల్ సెలెక్షన్ కమిటీ అతని స్థానంలో మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తమ పోస్ట్‌లు నిలబెట్టుకున్నారు. ఈ ఇద్దరినీ తిరిగి నియమిస్తున్నట్టు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. చీఫ్ కోచ్ ఎంపికలో అనుసరించినట్టు.. సపోర్ట్ స్టాఫ్‌లో ప్రతి పొజిషన్ కోసం ప్రాధాన్య క్రమంలో ముగ్గురేసి అభ్యర్థులను ఎంపిక చేసింది.కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ డిక్లరేషన్ సమర్పించిన అనంతరం ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న వారు ఆయా పోస్ట్‌లు చేపట్టడం లాంఛనమే. ఇక, టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియంపై కూడా వేటు పడింది. కరీబియన్ దీవుల్లో ఇండియా హైకమిషన్ అధికారులతో అమర్యాదగా మాట్లాడి సీఓఏ మందలింపునకు గురైన సునీల్ ప్లేస్‌లో హైదరాబాదీ గిరీష్ డోంగ్రె బాధ్యతలు చేపట్టనున్నాడు. హైదరాబాద్ అండర్–19 మాజీ కోచ్ అయిన డోంగ్రెకు ఆస్ట్రేలియా సహా పలు జట్లకు లైసన్ ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అలాగే, కొత్త ఫిజియోథెరపిస్ట్‌గా నితిన్ పటేల్‌కు సెలెక్షన్ కమిటీ తొలి ప్రాధాన్యత ఇచ్చింది. వరల్డ్‌కప్‌తో పాట్రిక్ ఫర్హత్ పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ కోసం ఐదుగురు అభ్యర్థులను ఎన్‌సీఏలో రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసి వారి సామర్థ్యాలను గుర్తించాలని కమిటీ నిర్ణయించింది.
సంజయ్ బంగర్‌పై వేటు
Related tags :