WorldWonders

రెండు కేజీల పులస చేప రూ. 13వేలు

2KGs Pulasa Is 13000 INR

గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో యానాం ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పెద్ద పులసలు లభ్యమవుతున్నాయి. శుక్రవారం స్థానిక శివం స్నానఘట్టం వద్దకు పెద్ద పులస చేపలను మత్స్యకారులు తీసుకొచ్చారు. అక్కడ నిర్వహించిన వేలం పాటలో ఓ చేపను పొన్నమండ రత్నం అనే మహిళ రూ. 13 వేలకు దక్కించుకుంది. 2 కిలోలకు పైగా ఉన్న దీన్ని కొనుగోలు చేసి అనంతరం ఆమె మార్కెట్‌లో విక్రయానికి పెట్టింది.