జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర పొడి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచుతుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది. కడుపులోని గ్యాస్ని బయటకి నెట్టి వేస్తుంది. అరటి పండుని తీసుకొని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే.. హాయిగా నిద్ర వస్తుంది. అధిక బరువు తగ్గుతారు. జీలకర్ర వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగినందున శరీరంలో చేరిన మురికిని, ఫ్రీ రాడికల్స్ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. -జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. పైత్యరసం ఫాట్స్ను విఛిన్నం చేయటంలో పోషకాలను గ్రహించటంలో సహాయపడుతుంది.
ఏకాగ్రత కోసం జీలకర్ర
Related tags :