అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల వాషింగ్టన్ డీసీలో తానా మహాసభలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దీనిని సాకుగా తీసుకుని వైకాపా నేతలు వేరొక రకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. తానాకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ అమెరికాలో రెండువేల కోట్ల నల్లదనాన్ని తెల్ల ధనంగా మార్చుకునారని వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తో పాటు ఆపార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. వైకాపా సామాజిక మాద్యమం నిర్వాహకులపై ప్రతిదాడులను ప్రారంభించారు. హైదరాబాద్ లో సైబర్ క్రైం పోలీసులకు జనసేన నాయకులు శంకర్ గౌడ్, హరిప్రసాద్ లు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
తానా ద్వారా పవన్ నల్లదనం మార్చారా!?
Related tags :