Agriculture

వరిలో సమగ్ర సస్యరక్షణ విధానాలు

Here is the list of total care that needs to be taken in paddy farming-వరిలో సమగ్ర సస్యరక్షణ విధానాలు

నిరోదక శక్తి గల రకాలను ఎంచుకోవాలి
విత్తన శుధ్ధి తప్పక పాటి౦చాలి.
నారు మడిలో సస్యరక్షణ తప్పక చేయాలి.
నారు కొసలను త్రుంచి నాటాలి.
2మీ.కు 20 సే౦.మీ. బాటలు తీయాలి.
లింగాకర్షక బుట్టలతో మొగిపురుగు/ఆకుముడుత పురుగుల ఉధృతి గమనించాలి.
హాని చేయుపురుగులు-మిత్రపురుగుల నిష్పత్తి(2:1) ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యలను వాయుదా వేయవచ్చును.
నీటి యాజమాన్యం తప్పక పాటించాలి
దుబ్బులను నేల మట్టానికి కోసి లోతుదుక్కి చేయాలి
ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఎకరాకు 20,000 చొప్పున నాటిన 30-45 రోజులలో 3 దఫాలుగా పొలంలో వదలాలి
పొలం గుట్లపై ఉండే గడ్డి/కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేయాలి
మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళు/పురుగుల అభివృద్దిని అదుపులో ఉంచవచ్చు.
నత్రజని ఎరువును సిఫారసుకు మించి వేయవద్దు
తప్పనిసరి పరిస్థితులలో క్రిమిసంహారక/శిలీంధ్రనాశినులను పిచికారిచేయాలి
పిచికారికి నాప్ శాక్/పవర్ స్ప్రేయర్లను ఉపయోగించాలి